యువతకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం.ఆటల వలన మన శరీరం ఫిట్ అవ్వడంతో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము.
ఈ క్రమంలో మన దేశంలో ఉన్న ప్రజలు అందరు ఆటలు ఆడుతూ, వ్యాయామాలు చేస్తూ తమ దేహధారుడ్యాన్ని పెంచుకోవాలనే మంచి ఉద్దేశ్యంతో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫిట్ ఇండియా అనే ఉద్యమాన్ని ప్రారంభించారు.ఈ ఉద్యమాన్ని ప్రారంభించి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది.
ఈ క్రమంలో ఢిల్లీలో గల మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో స్పోర్ట్స్ డే సందర్భంగా నిర్వహించించిన ఒక కార్యక్రమంలో మన దేశ కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫిట్ ఇండియా అనే ఒక మొబైల్ యాప్ లాంచ్ చేశారు.ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ రెండు భాషల్లో లభ్యం అవుతుంది.
అలాగే ఈ యాప్ ఆండ్రాయిడ్, IOS ప్లాట్ ఫామ్ లపై కూడా చేస్తుంది.
తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఎవరయితే ఫిట్ గా ఉండాలని అనుకుంటారో వాళ్ళు ఉచితంగా ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
అంతేకాకుండా ఈ యాప్లో అనేక కొత్త ఫీచర్లతో పాటు ఫిట్నెస్ స్కోర్, యానిమేటెడ్ వీడియోలు, యాక్టివిటీ ట్రాకర్, మై ప్లాన్ అనే ఆప్షన్ కూడా ఉన్నాయని మంత్రి అనురాగ్ చెప్పారు.ఈ మీటింగ్ లో పాల్గొన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రజలందరికి ఫిట్నెస్ చాలా ముఖ్యం అని చెప్పి తన ఫిట్నెస్ ను కూడా అందరికి చూపించి ఆశ్చర్యపరిచాడు.
స్టేజ్ మీద ఆగకుండా స్కిప్పింగ్ చేసారు.స్కిప్పింగ్ లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని కూడా ప్రదర్శించాడు.ఆయన ఫిట్నెస్ చూసి అక్కడ ఉన్న అందరు ఆశ్చర్యపోయారు.ప్రస్తుతం అనురాగ్ ఠాకూర్ కు సంబంధించిన ఈ స్కిప్పింగ్ వీడియో సొసైల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
అనురాగ్ ఒక క్రీడాకారుడు.తరువాత రాజకీయాల్లోకి ప్రవేశం చేసారు.
అయినప్పటికీ తన బాడీ ఫిట్నెస్ పట్ల శ్రద్ద మాత్రం తగ్గించకుండా ప్రతి రోజు వ్యాయామం చేస్తుంటానని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.ప్రజలు అందరూ కూడా ఈ ఫిట్ ఇండియా అనే మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు కూడా ఫిట్ గా ఉండాలని పిలుపునిచ్చారు.