జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మొదటి నుంచి నమ్మకం పెట్టుకున్న గోదావరి జిల్లాలో ఈనెల 14వ తేదీ నుంచి పర్యటించబోతున్నారు.ఈ జిల్లాలో మొదటి నుంచి జనసేనకు గట్టిపట్టు ఉండడం తో, ఈసారి జరగబోయే ఎన్నికల్లో టిడిపి తో పొత్తులో భాగంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకోవాలనే ఆలోచనతో పవన్ ఉన్నారు.2019 ఎన్నికల్లో జనసేనకు( Janasena ) కేవలం ఒకే ఒక్క సీటు దక్కింది.రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాదరావు ఒక్కరే గెలవగా, చాలా నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు.
అయితే ఈసారి వైసిపి( ycp ) ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో టిడిపి తో పొత్తు కలిసి వచ్చి జనసేనకు వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కుతాయనే అంచనాలో పవన్ ఉన్నారు.
ప్రస్తుతం పవన్ పార్టీ నాయకుల్లో ఉత్సాహం పెంచి, క్షేత్రస్థాయిలో వారు చురుగ్గా పనిచేసే విధంగా తన పర్యటనలలో కీలక సూచనలు చేయబోతున్నారు.
గ్రామ, మండల స్థాయి నాయకులతోనూ సమావేశం కాబోతున్నారు .అలాగే బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేసే ప్లాన్ చేసుకున్నారు.టిడిపితో( tdp ) పొత్తులో భాగంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లలో జనసేన 12 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది.
ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో 25 నియోజకవర్గాల్లో గట్టిపట్టు ఉందని అంచనా వేస్తోంది.అందులో 12 సీట్లను తాము తీసుకుంటే కచ్చితంగా గెలిచి తీరుతామనే అంచనాలో పవన్ ఉన్నారు.ఇక భీమవరం, కాకినాడ నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు.
భీమవరం నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి గంది శ్రీనివాస్( Gandi Srinivas ) చేతిలో ఓటమి చెందడంతో పవన్ మళ్లీ ఓడిన చోట నుంచే గెలవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లుగా జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో భీమవరం నుంచి పవన్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఇదే కాకుండా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై వారాహి యాత్రలో భాగంగా పవన్ తీవ్ర విమర్శలు చేశారు.
అంతే స్థాయిలో పవన్ పైన ద్వారంపూడి విమర్శలు చేయడంతో , ఆ నియోజకవర్గలపైన ఫోకస్ పెట్టి ఈసారి ద్వారంపూడిని ఓడించి తీరాలనే లక్ష్యంతో పవన్ ఉన్నారు.ఇక ఈ రెండు జిల్లాల్లో తన పర్యటన ద్వారా జనసేన గ్రాఫ్ మరింతగా పెరుగుతుందని ,ఈ గ్రాఫ్ చూపించే పొత్తుల భాగంగా టిడిపిని మరిన్ని అదనపు సీట్లు డిమాండ్ చేయాలనే ఆలోచనతో పవన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.