మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఈగల్.( Eagle Movie ) ఈ సినిమా రాజాగా ఫిబ్రవరి 9న విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించింది.
ఈ సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ మీట్ ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన హరీష్ శంకర్( Harish Shankar ) సినిమాపై విమర్శలు చేస్తున్న వారిపై ఫైర్ అయ్యారు.
కారైకూడిలో ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ షూటింగ్ చేస్తున్నాం.మా కోసం ప్రత్యేకంగా ఈగల్ షో వేశారు.
ఫస్టాఫ్ చూసిన తర్వాత బాగుంది అనిపించింది.సెకండాఫ్ చూసిన తర్వాత మైండ్‌బ్లోయింగ్ అనిపించింది.
అమేజింగ్ ఫిల్మ్.ఇలాంటి పాయింట్‌ని ఇంత స్టయిలిష్‌గా చెప్పడం మాములు విషయం కాదు.
అందుకు కార్తీక్‌కు కంగ్రాట్స్ చెబుతున్నాను.నిజంగా చెప్పాలంటే.ఇదే కథ నాకు ఇచ్చి ఉంటే ఇంత గొప్పగా తీసి ఉండేవాడిని కానేమో.సినిమా రిలీజ్‌కు ముందు నుండి రవితేజ గారు( Raviteja ) ముగ్గురు గురించి చాలా బాగా చెబుతుండేవారు.
అందులో డైలాగ్ రైటర్ మణిబాబు ఒకరు.నిజంగానే అతను చాలా మంచి డైలాగ్స్ రాశారు.
ఆ తర్వాత దేవ్ జాంద్. ఆయన పేరును పలకడం కోసం ఎంత ప్రాక్టీస్ చేశానంటే.
నేను చదువుకునే రోజుల్లో కూడా అంత ప్రాక్టీస్ చేయలేదు.ఆయన పేరులోనే మ్యూజిక్ ఉంది.
అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు అని చెప్పుకొచ్చారు హరీష్ శంకర్.అనంతరం విమర్శల గురించి స్పందిస్తూ.
సినిమాను విమర్శించే ముందు కార్తిక్( Director Karthik ) ఒక అద్భుతమైన సినిమాటోగ్రాఫర్.ఆయన చేయాలి అనుకుంటే ఇప్పుడాయన చేతిలో వరసగా 10 సినిమాలు ఉంటాయ్.
చాలా మంది దర్శకులు నా దగ్గరకు వచ్చి కూడా ఆయన పేరు చెబుతుంటారు.మంచి సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుని అంతటితో సంతృప్తి పడకుండా కష్టపడి, డైరెక్టర్ అయ్యే స్థాయికి వచ్చారు.ఈ రోజు ప్రపంచం అంతా మెచ్చుకునే ఒక సినిమా తీశాడు.ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది.ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందనేది పక్కన పెడితే అతడిని విమర్శించే ముందు ఒక్కసారి అతని జర్నీ గురించి ఆలోచించాలి కదా.లవ్ స్టోరీ( Love Story ) లేదు అనే మాట విని చాలా బాధేసింది.తర్వాత ఆరా తీస్తే ఇదే బ్యాచ్ ఆర్ఆర్ఆర్ మూవీలో( RRR ) రొమాన్స్ లేదని అన్నారట.ఆ తర్వాత తెలిసింది నాకు.ఎవరా వ్యక్తి అంటే.తర్వాత చెప్పారు అంటూ కాస్త ఘాటుగా స్పందించారు హరీష్ శంకర్.