Aishwarya Rai : ఆ తెలుగు హిట్ సినిమాలో హీరోయిన్ రోల్ ఐశ్వర్యరాయ్ కే ఇద్దామనుకున్నారు.. కానీ ?

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్‌( Aishwarya Rai ) చాలా సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించింది కానీ తెలుగులో ఒక్క సినిమాలో కూడా చేయలేదు.1999లో వచ్చిన “రావోయి చందమామ” సినిమాలో ఒక పాటలో మెరిసింది కానీ హీరోయిన్‌గా ఫుల్ లెంత్ రోల్ ఆమె చేసింది లేదు.ఐశ్వర్య ఒక్క తెలుగు సినిమాలో కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్ యాక్టింగ్ రోల్ చేయకపోవడం బాధాకరం అని చెప్పుకోవచ్చు.నిజానికి తెలుగులో అవకాశాలు ఆమెకు బాగానే వచ్చాయి.

 How Aishwarya Rai Missed This Hit Movie In Tollywood-TeluguStop.com
Telugu Aishwarya Rai, Aishwaryarai, Anjala Zaveri, Venkatesh, Iruvar, Tollywood-

జయంత్‌ సి.పరాన్జీ డైరెక్షన్‌లో వెంకటేష్‌ హీరోగా నటించిన ‘ప్రేమించుకుందాం.రా (1997)లో( Preminchukundam Raa ) హీరోయిన్ రోల్ ముందుగా ఐశ్వర్య రాయ్ వద్దకే రావాల్సి ఉంది.నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని పెట్టుకోవాలి అని దర్శకుడు బాగా ఆలోచించాడు.

జయంత్‌( Jayanth C Paranjee ) ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి ఐశ్వర్య రాయ్‌తో పరిచయం ఉంది.అందుకే ఈ దర్శకుడు ఆమెనే హీరోయిన్‌గా తీసుకుంటే బాగుంటుందని అనుకున్నాడు.ఇదే విషయాన్ని నిర్మాతతో పాటు మూవీ టీమ్‌కు తెలియజేశాడు.అయితే ఆమెను హీరోయిన్‌గా పెట్టుకోవడానికి ఎవరూ ఒప్పుకోలేదు.

Telugu Aishwarya Rai, Aishwaryarai, Anjala Zaveri, Venkatesh, Iruvar, Tollywood-

దానికి ఒక కారణం ఉంది.అదేంటంటే ఆ కాలంలో ఐశ్వర్య నటించిన ‘ఇరువర్‌’ మూవీ( Iruvar ) ఫ్లాప్‌ అయింది.మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఫెయిల్ అయిందని, అలాంటి ఫ్లాప్ హీరోయిన్ తో సినిమా తీస్తే ప్రేమించుకుందాం రా. కూడా ఫ్లాప్ అవుతుందని ఒక బ్యాడ్ సెంటిమెంట్ వారు నమ్మారు.ఆ విధంగా ఐశ్వర్య రాయ్‌ ఈ మంచి ఛాన్స్ కోల్పోయింది.చివరికి అది అంజలా జవేరికి( Anjala Zaveri ) దక్కింది.అంజలా ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంది.అయితే ఐశ్వర్య రాయ్‌ తో పోలిస్తే ఆమె యావరేజ్ బ్యూటీ అని చెప్పుకోవచ్చు.

Telugu Aishwarya Rai, Aishwaryarai, Anjala Zaveri, Venkatesh, Iruvar, Tollywood-

ఐశ్వర్యకి ఈ సినిమా ఛాన్స్ కోల్పోయిన ఆమెకు పెద్దగా నష్టం జరగలేదు.ఇరువర్‌ సినిమా తరువాత ఆమె చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి.దానివల్ల ఐశ్వర్య బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా అవతరించింది.తరువాత బాలీవుడ్‌ హీరోయిన్ ని తీసుకునేంత రేంజ్ టాలీవుడ్ దర్శకనిర్మాతలకు లేకుండా పోయింది.ప్రస్తుతం ఐశ్వర్య డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇక ఐశ్వర్యరాయ్ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జీన్స్‌’, ‘రోబో’ చిత్రాలు తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే.

ఐశ్వర్య నటించిన “ప్రియురాలు పిలిచింది” వంటి తెలుగు డబ్బింగ్‌ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్‌ చేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube