అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్,( BRS ) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలను( MP Seats ) గెలుచుకుని తన సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది .బీఆర్ఎస్ అధినేత కేసిఆర్( KCR ) అనేక వ్యూహాలు రచిస్తున్నారు .
పార్టీ తరఫున అభ్యర్థుల ఎంపిక , గెలుపు బాధ్యతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు( KTR ) అప్పగించారు.గత కొద్దిరోజులుగా ఎన్నికల పైనే దృష్టి సారించిన కేటీఆర్ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ మేరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను కేటీఆర్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు.
ఈ సమీక్షలో పాల్గొనేందుకు ఈరోజు నుంచి ఈనెల 21వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి.
మొదటి విడతలో జూన్ 3 నుంచి 12 వరకు నిర్వహిస్తారు.ఈరోజు ఆదిలాబాద్ ,( Adilabad ) నాలుగో తేదీన కరీంనగర్,( Karimnagar ) ఐదున చేవెళ్ల 6న పెద్దపల్లి 7న నిజామాబాద్ 8న, జహీరాబాద్ 9 వరంగల్ 11న ,మహబూబాబాద్, 12న భువనగిరి స్థానంపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఇక 16 నుంచి వరుసగా మీటింగ్ లు నిర్వహించే విధంగా ప్లాన్ చేశారు.
నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబాద్ , మెదక్ మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో రెండో విడతలుగా సమీక్ష నిర్వహిస్తారు.ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాన్ని కేటీఆర్ నిర్వహిస్తున్నారు.ప్రతిరోజు ఒక లోక్ సభ నియోజకవర్గం నాయకులతో సమావేశం నిర్వహించి పార్లమెంటు ఎన్నికల్లో( Parliament Elections ) అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.
ఈ సమావేశానికి హాజరయ్యే ముఖ్య నాయకుల అభిప్రాయాలు తీసుకుని దానికి అనుగుణంగా కార్యాచరణను రూపొందిస్తున్నారు.
అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సమావేశాలకు ఆయా లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలు అందరిని రావాల్సిందిగా ఆహ్వానించారు.ఎమ్మెల్సీలు ,ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్ లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు , జిల్లా పార్టీ అధ్యక్షులు ఇతర కీలక నేతలు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు .పూర్తిగా అన్ని ఎంపీ స్థానాల్లోనూ గెలిచే విధంగా కేటీఆర్ అన్ని నియోజకవర్గాల పైన దృష్టి సారించి ముందుకు వెళ్తున్నారు.