ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.ఫన్నీ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసి ఆకట్టుకుంటుంటారు.
తాజాగా ఈ బిజినెస్ దిగ్గజం 700 రూపాయలకే థార్ కారు ఇవ్వాలని ముద్దు ముద్దు మాటలు మాట్లాడిన ఓ అబ్బాయి వీడియోను షేర్ చేశారు.ఆ అబ్బాయి పేరు చీకు యాదవ్, నోయిడాలో నివసిస్తున్నాడు.
వీడియోలో, అతను తన తండ్రితో మాట్లాడి, మహీంద్రా థార్ కొనాలనుకుంటున్నట్లు చెప్పాడు.
మహీంద్రా కార్లలోని రెండు మోడల్స్ అయిన థార్,, ఎక్స్‌యూవీ 700 మధ్య వ్యత్యాసం అబ్బాయికి తెలియదు.అవి ఒకే కారుగా భావించి ఒక్కోటి ధర రూ.700 చెప్పాడు.సోషల్ మీడియా( Social media )లో చాలా మంది ఈ వీడియోను చూసి బాగా నవ్వుకున్నారు.బాలుడి 700 కే థార్ కారు( Mahindra Thar ) కొనుగోలు చేయగలరని చెప్పడం విని మరింత నవ్వారు.
ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియోను చూసి జోక్ చేశారు.థార్‌ను రూ.700కి అమ్మితే తమ కంపెనీకి భారీగా నష్టం వచ్చి వ్యాపారం దివాలా తీస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు.తన స్నేహితురాలు సూని తారాపొరేవాలా తనకు ఈ వీడియో పంపి, చీకును ప్రేమిస్తున్నట్లు చెప్పారని కూడా చెప్పారు.
ఇన్‌స్టాగ్రామ్ (@cheekuthenoidakid)లో ఈ బాలుడు వీడియోలలో కొన్నింటిని చూశానని, అతని వీడియోలు బాగా నచ్చేసాయని అన్నారు.
ఆనంద్ మహీంద్రా పోస్ట్‌ను చూసిన వ్యక్తులు దానిపై వ్యాఖ్యానించి తమ భావాలను వ్యక్తం చేశారు.వారిలో కొందరు బాలుడి కలను నిజం చేసి అతనికి థార్ కారును బహుమతిగా ఇవ్వాలని ఆనంద్ మహీంద్రాను కోరారు.మరికొందరు మహీంద్రా బ్రాండ్‌ను ప్రోత్సహించడానికి బాలుడి ప్రజాదరణను ఉపయోగించుకోవడానికి కొన్ని మార్గాలను సూచించారు.