నెగటివ్ రోల్స్ కి ఓకే చెప్తున్న పూజా హెగ్డే..పాపం బుట్టబొమ్మ పరిస్థితి ఇలా అయ్యిందేంటి!

ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కు౭వ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఇమేజి ని దక్కించుకున్న హీరోయిన్ పూజ హెగ్డే( Pooja Hegde ).ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన పూజ హెగ్డే, ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో ‘మోహెన్ జోడారో’ ( Mohen Jodaro )అనే సినిమా చేసింది.

 Pooja Hegde Saying Okay For Negative Roles , Pooja Hegde, Duvvada Jagannathem, M-TeluguStop.com

ఈ సినిమా ఫ్లాప్ తర్వాత ఒక రెండేళ్లు గ్యాప్ తీసుకొని మన టాలీవుడ్ లో ‘దువ్వాడా జగన్నాథం’ ( Duvvada Jagannathem )సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ అతి తక్కువ సమయం లోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.అయితే నిన్న మొన్నటి వరకు వరుసగా క్రేజీ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్న పూజా హెగ్డే, అకస్మాత్తుగా మాయం అయిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.

Telugu Bollywood, Mohen Jodaro, Shades, Pooja Hegde, Tollywood-Movie

ఆమెకి వరుసగా ఫ్లాప్స్ రావడం , అదే సమయం లో శ్రీలీల( Srilila ) సక్సెస్ అవ్వడం తో మేకర్స్ అందరికీ శ్రీలీలనే మొదటి ఛాయస్ అయ్యింది.అప్పటి నుండి పూజా కి డిమాండ్ తగ్గింది అంటున్నారు.మరి కొంతమంది అయితే ఆమె చిన్న సినిమాకి 4 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్, పెద్ద సినిమాకి 7 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అడుగుతుంది అని, అంత ఇచ్చేందుకు ఆసక్తి చూపలేకపోవడం వల్లే మేకర్స్ పూజ ని దూరం పెడుతున్నారు అంటూ సోషల్ మీడియా లో ఒక రూమర్ ఉంది.కానీ ఆమె ఆచి తూచి సినిమాలను ఒప్పుకుంటుండడం వల్లే గ్యాప్ ఇస్తుందట.

ఇన్ని రోజులు కేవలం గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితమైన పూజా హెగ్డే, ఇక నుండి నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుందట.అందులో భాగం గా రీసెంట్ గా ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ కి వెబ్ సిరీస్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

Telugu Bollywood, Mohen Jodaro, Shades, Pooja Hegde, Tollywood-Movie

ఇందులో పూజ హెగ్డే క్యారక్టర్ చాలా బోల్డ్ గా, పూర్తి స్థాయి నెగటివ్ షేడ్స్ లో ఉంటుందట.నెగటివ్ రోల్ లో ఆమె చెయ్యడం ఇదే మొదటిసారి.పూజ హెగ్డే కి యాక్టింగ్ రాదు, కేవలం అందాలను ఆరబొయ్యడం తప్ప అని ఇండస్ట్రీ లో ఒక చెడ్డపేరు ఉంది.ఇక నుండి ఆ పేరు కి దూరం అవ్వాలనే నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చెయ్యడానికి చూస్తుందట.

కేవలం వెబ్ సిరీస్ లోనే కాదు, సినిమాల్లో కూడా పూర్తి స్థాయి నెగటివ్ రోల్స్ చెయ్యడానికి సిద్ధం అని అంటుంది.చూడాలి మరి ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube