రేవంత్ రెడ్డి మోడీని కలిసేందుకు భట్టి ని తీసుకు వెళ్లడానికి కారణం అదేనా..?

తెలంగాణ ( Telangana ) లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాక కాంగ్రెస్ మెజారిటీతో గెలిచాక సీఎం రేవంత్ రెడ్డి అవుతారని తెలిసి చాలామంది కాంగ్రెస్ పార్టీలో ముందు నుండి ఉన్న సీనియర్ నాయకులు కాస్త గుస్సాయించారు.

అంతే కాదు ఎన్నికలకు ముందే నేనంటే నేను సీఎం అని ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకున్నారు సీనియర్ నాయకులు.

ఇక చివరికి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.అయితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తనకంటే సీనియర్లు అందరినీ కలుపుకుంటూ పోతున్నారు.

అంతేకాదు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానమంత్రి మోడీ ( Modi ) ని కలవడానికి ఒక్కడిగా వెళ్లొచ్చు.కానీ ఆయన భట్టిని తీసుకువెళ్లడం వెనుక ఒక కారణం ఉందని తెలుస్తోంది.

ఎందుకంటే ఒకవేళ రేవంత్ రెడ్డి ఒక్కడే పోతే ఏకపక్ష నిర్ణయం అని మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని పార్టీలోని కొంతమంది ఆయనపై గుర్రుగా ఉంటారు.కానీ డిప్యూటీ సీఎం అయినా భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) ని తనతోపాటు తీసుకువెళ్లడం ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక్కడు మాత్రమే వెళ్లకుండా ఆయనను తీసుకువెళ్తే పార్టీలో సీనియర్ నాయకుల్లో రేవంత్ రెడ్డి పై మంచి అభిప్రాయం ఉంటుంది.అయితే ఈరోజు అంటే మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లడానికి షెడ్యూల్ ఖరారు అయింది.

Advertisement

అయితే ఈరోజు భట్టి విక్రమార్క కి ఖమ్మం ( Khammam ) లో పర్యటన ఉంది.కానీ దాన్ని కూడా రద్దు చేయించి రేవంత్ రెడ్డి తనతో పాటు భట్టి విక్రమార్కను తీసుకు వెళుతున్నారు.ఇక రేవంత్ రెడ్డి తనది మోనార్క్ పాలన కాదని, తాను అందరూ సీనియర్లను కలుపుకుంటూ పోతాను అనే భావన సీనియర్ నాయకుల్లో, ప్రజల్లో కలగాలి అనే ఉద్దేశంతోనే అలా తనతో పాటు భట్టి విక్రమార్కని తీసుకు వెళ్తున్నారని తెలుస్తోంది.

అయితే గతంలో కేసీఆర్ మాత్రం ఏ విషయంలోనైనా ఒక్కడే నిర్ణయం తీసుకునేవాడుకానీ కాంగ్రెస్లో మాత్రం అలా కాదని అందరి అభిప్రాయాలతోనే ముందుకు వెళ్తాం అనే భావన అందరిలో కలిగిస్తున్నారు రేవంత్ రెడ్డి( Revanth Reddy ).అలాగే ఈయన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆయన నిర్ణయం కంటే ఎక్కువగా సీనియర్ల నిర్ణయానికే ప్రాధాన్యత ఇస్తున్నారట.ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు కూడా ఉండదని, వారిలో వాళ్లే గొడవలు పెట్టుకుని ప్రభుత్వం పడిపోతుంది అని ప్రచారం చేస్తున్నారు.

ఇక ఈ ప్రచారానికి తెరపడేలా రేవంత్ రెడ్డి అందర్నీ కలుపుకొని పోతున్నట్టు తెలుస్తోంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు