తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు వెంకటేష్( Venkatesh ) ఒకరు.ఈయన దివంగత నిర్మాత రామానాయుడు( Rama Naidu ) కుమారుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు.
హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో అద్భుతమైనటువంటి కుటుంబ కథా నేపథ్యంలో ప్రేమ కథ చిత్రాలలోనూ వెంకటేష్ నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వివాదాలకు దూరంగా ఉండే ఈయనకు అభిమానులు కూడా అదే స్థాయిలో పెరిగి పోయారు.

ఇక ఇప్పటికీ ఈయన పలువురు యంగ్ హీరోలతో కలిసి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను నటిస్తున్నారు వెంకటేష్ ఎమోషనల్ సినిమాలలో అలాగే కామెడీ సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.త్వరలోనే ఈయన సైంధవ్( Saindhav ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా విడుదల కానున్న తరుణంలో వెంకటేష్ కి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హీరో వెంకటేష్ ఇన్ని సంవత్సరాలపాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంత మొత్తంలో సంపాదించారు అనే విషయాల గురించి కూడా తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.వెంకటేష్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు 10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.
ఇక ఈయన ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీ స్థాయిలోనే ఆస్తులు కూడా పెట్టారు.పలు నివేదికల సమాచారం ప్రకారం వెంకటేష్ ఇప్పటివరకు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తుంది.
అదేవిధంగా తన తండ్రి నుంచి కూడా ఈయనకు వారసత్వంగా మరో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు కూడా కలిసి వచ్చాయట.

ఇలా వెంకటేష్ కొన్ని వేల కోట్ల రూపాయలకు ఆస్తిపరుడు అని చెప్పాలి.ఇక ఈయనకు సినిమా తప్ప మరే బిజినెస్ లు కూడా లేవు ఈయన హీరోగా కొనసాగడమే కాకుండా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా కొన్ని సినిమాలకు సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు.ఇక వెంకటేష్ వ్యక్తిగత విషయానికి వస్తే నీరజ అనే మహిళను పెళ్లి చేసుకున్నటువంటి వెంకటేష్ నలుగురు పిల్లలకు తండ్రి అయ్యారు.
ఈయనకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు.అయితే పెద్దమ్మాయికి ఇదివరకే పెళ్లి చేయగా ఇటీవల రెండవ అమ్మాయికి కూడా ఘనంగా నిశ్చితార్థం జరిపించిన సంగతి తెలిసిందే.
ఇక మూడో అమ్మాయి కెరియర్ పరంగా బిజీగా ఉండగా అబ్బాయి ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లారు.