ఎప్పుడైనా ఫ్లూయిడ్ మోషన్ ఎఫెక్ట్స్ చూశారా.. ఈ వీడియో చూస్తే మతిపోతుంది..

సాధారణంగా ఫ్లూయిడ్స్(fluids ) లేదా వాటర్‌లో ఏవైనా ఆబ్జెక్ట్స్ డ్రాప్ చేస్తే ఆ ద్రవాలు రకరకాల ఆకారాలలో పైకి లేస్తాయి.అయితే కన్ను మూసి తెరిచేలోగా ఆ దృశ్యాలు మాయమవుతాయి.

 Have You Ever Seen Fluid Motion Effects.. This Video Will Make You Crazy.. , Vir-TeluguStop.com

అందువల్ల వాటిని ఎక్కువసేపు మనం చూడలేము.అయితే ఇప్పుడు స్లో మోషన్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఈ అద్భుతమైన ఆకారాలను చూసే ఛాన్స్ ప్రస్తుత ప్రజలకు దొరికిందని చెప్పవచ్చు.

తాజాగా ఫ్లూయిడ్ మోషన్ ఎఫెక్ట్స్ ( slow motion fluid effects )చూపించే ఒక వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.ఈ వీడియోను @gunsnrosesgirl3 ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.24 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

“వస్తువులను ఫ్లూయిడ్స్‌లో డ్రాప్ చేసినప్పుడు మెస్మరైజింగ్ ఫ్లూయిడ్ మోషన్ ఎఫెక్ట్స్ కనిపించడాన్ని స్లో మోషన్‌లో చూసేయండి.” అని దీనికి ఒక క్యాప్షన్ జోడించారు.వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు ముందుగా ఒక గిన్నెలో గ్రీన్ ఫ్లూయిడ్ కనిపిస్తుంది.అందులో ఒక రింగ్ లాంటి వస్తువును డ్రాప్ చేశారు.అప్పుడు ఒక టవర్ లాంటి ఆకారం పైకి పెరుగుతూ కనిపించింది.తర్వాత చిల్లులు గల రింగ్ ను ఆకుపచ్చ ద్రవంలో వేశారు.

అది వివిధ ప్యాటర్న్‌లతో ద్రవాన్ని పైకి చిందించింది.ఇది ఒక గ్రాఫికల్ ఎఫెక్ట్ చూసినట్లుగానే అనిపించింది.

ఒకానొక ఫ్రేమ్‌లో ఏలియన్ వంటి ఆకారం కూడా చూడవచ్చు.

తర్వాత కప్పులో ఉన్నావు కదా ద్రవంలో గుడ్డు( Egg ) వేస్తే అది ఒక ఆటమిక్ బాంబు లాగా పైకి ఉబికి వచ్చింది.కొవ్వొత్తి ఒక ద్రవంలో పెట్టి దానిపై ఆబ్జెక్ట్ డ్రాప్ చేసినప్పుడు కూడా స్టన్నింగ్ మోషన్ ఎఫెక్ట్స్ కనిపించాయి.మొత్తం మీద ఈ వీడియోలోని ఎఫెక్ట్స్ మైమరిపిస్తున్నాయి.

దీనిని మీరు కూడా తప్పక చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube