ఈ ఏడాది మన టాలీవుడ్ లో సక్సెస్ రేట్ కంటే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ.అధిక శాతం చిన్న సినిమాలే హిట్ అవ్వడం , పెద్ద సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ కుదేలు అయ్యింది.
ప్రారంభం లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య‘ సినిమా పెద్ద హిట్ అయ్యి దాదాపుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.ఈ సినిమాతో పోటీకి వచ్చిన ‘వీర సింహా రెడ్డి‘ కూడా 80 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి టాలీవుడ్ కి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అనే సంకేతాలు ఇచ్చింది.
ఈ రెండు సినిమాల తర్వాత అసలు సిసలు గడ్డు సమయం మన టాలీవుడ్ కి మొదలైంది.భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి.
చివరికి ప్రభాస్ ‘ఆదిపురుష్’ మరియు పవన్ కళ్యాణ్ ‘బ్రో( BRO The Avatar )’ చిత్రాలపై భారీ ఆశలు పెట్టుకున్నారు బయ్యర్స్.

కానీ ఆ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.ఇక క్రేజీ స్టార్ హీరోల సినిమాలు ప్లాప్ అవుతున్న ఈ సందర్భంలో మీడియం రేంజ్ సినిమాలు మరియు డబ్బింగ్ సినిమాలే టాలీవుడ్ ని ఆడుకున్నాయి.అయితే ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ( Waltair Veerayya )సినిమాకి దాదాపుగా 5 వారాల అద్భుతమైన థియేట్రికల్ రన్ వచ్చింది.ఈ 5 వారాల్లో ఆ సినిమాకి అక్షరాలా కోటి 20 లక్షల రూపాయిల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం.
ఈ ఏడాది కి టాలీవుడ్ కి ఇదే హైయెస్ట్ అట.ఈ సినిమా తర్వాత ప్రభాస్ హీరో నటించిన ఆదిపురుష్ చిత్రం నిల్చింది.సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ దేవుడి చిత్రం కాబట్టి ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 90 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం.

ఇక ఆదిపురుష్( Adipurush ) చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్( BRO The Avatar )’ చిత్రం 82 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయి మూడవ స్థానం లో నిల్చింది.ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ రేంజ్ వసూళ్లు రావడం కేవలం పవర్ స్టార్ స్టామినా అనే చెప్పాలి.ఈ రెండు సినిమాల తర్వాత బాలయ్య బాబు నటించిన వీర సింహా రెడ్డి మరియు భవన్త కేసరి చిత్రాలు నిలిచాయి.
ఈ రెండు సినిమాలకు 70 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయట.అలా ఈ ఏడాది అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన టాప్ 5 టాలీవుడ్ చిత్రాలు గా ఇవి నిలిచాయి.