అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన జబర్దస్త్ నరేష్.. తన సీక్రెట్ లవర్ ని పరిచయం చేస్తూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ పొట్టి నరేష్( comedian Potti Naresh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకోవడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా అభిమానులను సంపాదించుకున్నారు నరేష్.

 Jabardasth Naresh Introduced His Lover After Two Years Secret Love Big Surprise-TeluguStop.com

తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.ప్రస్తుతం నరేష్ శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ) జబర్దస్త్ షోలలో కామెడీ చేస్తూ ఉ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక చాలా సందర్భాలలో జబర్దస్త్ స్టేజ్ పై అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజిపై తన పెళ్లి విషయం విషయం గురించి ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా కూడా చాలా స్పోటివ్ గా తీసుకునేవాడు.

Telugu Lover, Naresh, Secret Love-Movie

అయితే తరచూ ఆయన పెళ్లికి సెట్‌ కాడు, ప్రేమ, పెళ్లి ముచ్చట్లు ఉండవనేలా ఆయన స్కిట్లు ఉంటాయి.కానీ రియల్‌ లైఫ్‌లో మాత్రం తాను అన్నింటిలోనూ తగ్గేదెలే అని నిరూపించుకుంటున్నాడు.ఇన్ని రోజులపాటు దాచిపెట్టిన ఒక పెద్ద సీక్రెట్ ని తాజాగా అభిమానులకు సర్ప్రైజిస్తూ బయటపెట్టేసాడు నరేష్.

ఈ మేరకు షోలో అందరి ముందు తన ప్రియురాలిని పరిచయంచేయడం విశేషం.శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఆయన తన ప్రేమికురాలిని అందరికి ఇంట్రడ్యూస్‌ చేశాడు.ఇందులో యాంకర్‌ రష్మి.మేం విన్నది నిజమేనా అని అడగ్గా, అవునండి, ఇక నేనే చెప్పేస్తా.

ఇన్ని రోజులు చాలా సీక్రెట్‌గా మెయింటేన్‌ చేశాను.

Telugu Lover, Naresh, Secret Love-Movie

నాకూ ఒక లవర్‌ ఉంది అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ వెల్లడించారు.అంతలోనే తన ప్రియురాలిని స్టేజ్‌పైకి ఆహ్వానించారు.దీంతో ఆమె ఆనందంతో శ్రీదేవి డ్రామా కంపెనీ షో స్టేజ్‌పైకి వచ్చింది.

ఎప్పటిలాగే వీరిపై కూడా లవ్‌ డ్యూయెట్లు వేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.మాటల్లో చెప్పలేనంత లవ్‌ చేశారు.అంతటి ప్రేమనిచ్చాడు ఈ రెండేళ్లలో అని తెలిపింది.దీంతో నరేష్‌ స్టేజ్‌పైనే ఆమెకి గులాబీ పువ్వు ఇస్తూ లవ్‌ని ప్రపోజ్‌ చేశాడు.అయితే ఆయన ఇచ్చిన హార్ట్ బెలూన్, రోజాపువ్వు తీసుకుని ఆయనకు ముద్దు పెట్టింది నరేష్‌ లవర్‌.

ఈ సందర్భంగా ఇద్దరు కలిసి ప్రేమగీతానికి కొన్ని మూమెంట్స్ ఇచ్చారు.రచ్చ చేశారు.

అనంతరం నరేష్ ఫాదర్ కూడా స్టేజి పైకి రావడంతో వీరి ప్రేమ మీకు అంగీకారమేనా అని అడగగా నరేష్ తండ్రి అందుకు అంగీకరించడంతో వెంటనే నరేష్ అతని లవర్ ఇద్దరు కలిసి తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు.అయితే ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఇది నిజంగానే నా లేకపోతే కేవలం ప్రోమో కోసమా అనేది అర్థం కావడం లేదు.

ఇప్పటికే గతంలో ఇలాంటి ప్రోమోలు చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే.ఇప్పుడు కూడా చాలామంది ఇది కేవలం ప్రోమో కోసం మాత్రమే అని కొట్టి పారేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube