భారత్ – పాక్ సరిహద్దులో డ్రగ్స్ అక్రమ రవాణా గుట్టు రట్టైంది.పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ జిల్లాలో డ్రోన్స్ ద్వారా డ్రగ్స్ తరలిస్తున్నారు.
డ్రోన్ల సంచారాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ అక్రమ డ్రగ్స్ రవాణాకు చెక్ పెట్టింది.ఈ నేపథ్యంలో రోరన్ వాలా ఖుర్ద్ గ్రామంలో పంట పొలాల్లో ఓ డ్రోన్ ను గుర్తించింది.
డ్రోన్ తో పాటు అరకేజీ హెరాయిన్ ను బీఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం డ్రోన్ క్వాడ్ కాప్టర్ ను చైనాలో తయారు చేసినట్లు గుర్తించారు.