టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ కు కొత్త తలనొప్పి మొదలైంది.ముఖ్యంగా కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ , కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు పై ధీమా గానే ఉంటూ వచ్చిన కేసీఆర్( CM kcr ) ఇప్పుడు మాత్రం టెన్షన్ పడుతున్నారు.
దీనికి కారణం ఆ రెండు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అభ్యర్థులు ఎన్నికల్లో నామినేషన్ వేయడమే కారణం.మంగళవారం కొంతమంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, గజ్వేల్ లో 86 మంది కామారెడ్డిలో 58 మంది ఇంకా పోటీలోనే ఉన్నారు.
వారిలో మెజారిటీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు బీఆర్ఎస్ నాయకులు అనేక విధాలుగా ప్రయత్నించినా, ఫోన్ చేసి బుద్ధగించినా, వారు మాత్రం పోటీ నుంచి విరమించుకునేందుకు నిరాకరిస్తూ ఉండడంతో, ఈ విషయంలో ఏం చేయాలనే విషయంపై కేసీఆర్ సైతం ఆలోచనలో పడ్డారట.
ఈ మేరకు అక్కడ పరిస్థితులను చక్కదిద్దేందుకు మంత్రులు కేటీఆర్ , హరీష్( KTR , Harish rao ) రావులకు బాధ్యతలు అప్పగించారట.దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులకు స్వయంగా కేటీఆర్, హరీష్ రావు లు ఫోన్లు చేసి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారట.నామినేషన్లు ఉపసంహరించుకుంటే మీకు మేలు చేస్తామని అనేక ఆఫర్లు కూడా ఇస్తున్నారట.
కొంతమంది ఆఫర్లకు ఓకే చెబుతున్న, ఎక్కువమంది నో చెబుతుండడంతో వారిని నచ్చ చెప్పే విధంగా కొంతమంది కీలక నేతలను రంగంలోకి దింపారట. అయితే ఇప్పుడు నామినేషన్ వేసి పోటీలో ఉన్న వారిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ ( BRS )విధానాల వల్ల నష్టపోయిన సాధారణ వ్యక్తులే కావడం , కెసిఆర్ మీద పోటీ చేసి తమ ఇబ్బందులను వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతోనే వీరంతా నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఒప్పుకోవడం లేదట.
ముఖ్యంగా గజ్వేల్ లో మల్లన్న సాగర్ ముంపు బాధితులు , నిరుద్యోగులు నామినేషన్ వేశారు. కామారెడ్డి లో మాస్టర్ ప్లాన్ లో భూములు కోల్పోయిన రైతులు , అమరవీరుల కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నారు.అయితే ఇప్పుడు పోటీలో ఉన్న వారి కారణంగా గెలుపు పై పెద్దగా ప్రభావం కనిపించకపోయినా, మెజారిటీ తగ్గుతుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.అందుకే వీలైనంత ఎక్కువ మందితో నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.