తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఒకరు ఈయన ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి గుంటూరు కారం( Guntur Karam Movie ) సినిమా షూటింగ్ పనులలో ఉన్నారు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే సినిమా పనులలో బిజీ కానున్నారు.
ఇకపోతే మహేష్ బాబు గారాల పట్టి సితార( Sitara ) గురించి మనకు తెలిసిందే.
సితార ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో రకాల డాన్స్ వీడియోలతో పాటు ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే సితారకు డాన్స్ నేర్పిస్తున్నటువంటి యానీ మాస్టర్( Anee Master ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మహేష్ బాబు పిల్లల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మాట్లాడుతూ మొదట నేను గౌతమ్ కు డాన్స్ మాస్టర్గా అక్కడ జాయిన్ అయ్యానని తెలియజేశారు.
తాను గౌతమ్ కి డాన్స్ నేర్పిస్తున్న సమయంలో సితార చాలా చిన్నమ్మాయి ఆ సమయంలో అక్కడికి వచ్చి అలా ఇలా రెండు స్టెప్పులు వేస్తూ ముద్దు ముద్దుగా అక్కడి నుంచి పారిపోయేది.ఇలా తాను గౌతం కి డాన్స్ నేర్పిస్తూ ఉండే దానిని అయితే గౌతమ్( Gautam ) హైయెర్ స్టడీస్ కారణంగా వెళ్లిపోవడంతో సితార నాకు స్టూడెంట్ గా చేరిందని యానీ మాస్టర్ తెలిపారు.ఇక సితార చాలా మంచి అమ్మాయిని అందరితో చాలా సరదాగా ఉంటుందని తెలియజేశారు.
తను నా దగ్గర డాన్స్ కి జాయిన్ అయినప్పుడు ఇంత ఉండేది ఇప్పుడు నాకన్నా చాలా పొడవైన బహుశా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్స్ అందరికంటే కూడా సితారనే చాలా పొడుగ్గా ఉంటుంది అంటూ ఈ సందర్భంగా యానీ మాస్టర్ సితార గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక సితార తన దగ్గర చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది తాను ఒక సూపర్ స్టార్ కూతురు అనే యాటిట్యూడ్ అసలు చూపించదని అందరితో చాలా బాగా కలిసిపోతుంది అంటూ ఈమె తెలియజేశారు.
తనకు డాన్స్ ( Dance ) నేర్పడానికి వెళ్లే సమయంలో మీరు మహేష్ బాబుని ఎప్పుడైనా కలిసారా అంటూ ప్రశ్నించగా తాను మహేష్ బాబు సర్ గారిని ఎప్పుడు కలవలేదని అయితే ఒకసారి డాన్స్ క్లాస్ పూర్తి కాగానే బయటకు వస్తూ ఉండగా మహేష్ సర్ షూటింగ్ పూర్తిచేసుకుని ఎదురుగా వచ్చారు ఆయనని చూస్తూ ఇలాగే ఉండిపోయాను కానీ మహేష్ గారు మాత్రం హలో మాస్టర్ అంటూ పలకరిస్తూనే వెళ్లిపోతూ ఉంటారని ఈ సందర్భంగా యానీ మాస్టర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.