పప్పీతో ఆడుకుంటున్న సీతాకోకచిలుక.. వీడియో చూస్తే ఫిదా అవుతారు..

కుక్క పిల్లలను చూస్తే మనుషులకే కాదు ఇతర జీవులకు కూడా ముచ్చటేస్తుందని తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చెప్పకనే చెబుతోంది.ఈ వీడియోలో ఒక సీతాకోకచిలుక( Butterfly ) ఒక చిన్న కుక్క పిల్ల వద్దకు వెళ్లి ఆడుకుంది.

 Butterfly Playing With Puppy Viral On Social Media , Butterfly Playing With Pup-TeluguStop.com

దాని ముఖంపై వాలుతూ దానిని టీజ్‌ చేస్తూ కొద్దిసేపు ఆటాడుకుంది.ఈ వీడియోను సైన్స్ గర్ల్ అనే ట్విట్టర్( Twitter ) హ్యాండిల్ తాజాగా షేర్ చేసింది.55 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ఇప్పటికే 2 కోట్ల 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఒక ఇంటి ముందు వారండాలో చిన్న కుక్కపిల్ల పడుకొని ఉండటం చూడవచ్చు.దాని వద్దకు వచ్చిన సీతాకోకచిలుక దాని కళ్ళపై, ముక్కుపై, ముఖంపై వాలుతూ ఆట పట్టించింది.ఈ కుక్క పిల్ల( Puppy ) దానిని తన ముందరకాళ్లతో టచ్ చేస్తూ తన ముఖానికి దూరంగా ఉంచడానికి ప్రయత్నించింది.

అలాగే నోటితో దానిని పట్టుకోవడానికి కూడా ట్రై చేసింది.కొద్దిసేపు దాకా ఇవి రెండూ ఇలా ఆడుకున్నాయి.ఆ తర్వాత ఇక ఆడుకున్నది చాలు నేను లోపలికి వెళ్ళిపోతాను అన్నట్లుగా ఆ పప్పీ లేచి ఇంట్లోకి వెళ్లడం కనిపించింది.దాంతో ఈ బ్యూటిఫుల్ వీడియో ముగిసింది.

కుక్క కన్నీటి నాళాలలోని ఖనిజాలకు సీతాకోకచిలుక అట్రాక్ట్‌ అయ్యుంటుందని, ఇది వాసన కూడా పసిగట్టగలదు అని ఒక నెటిజన్‌ పేర్కొన్నాడు.సీతాకోకచిలుకలు తన కాళ్లతో టేస్ట్ చేయగలదని మరొకరు అన్నారు.అయితే ఇంత మంచి దృశ్యాన్ని ఇలాంటి సైంటిఫిక్ రీజన్స్ చెప్పి చెడగొట్టడం ఏం బాగోలేదని మరికొందరు పేర్కొన్నారు.“కుక్కకు బాగా కాలక్షేపం అయింది, హాయిగా దానితో ఆడుకుంది.” అని ఒకరు వ్యాఖ్యానించారు.ఈ వీడియో చాలా బ్యూటిఫుల్ గా ఉందని మరికొందరు అంటున్నారు.

దీని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube