తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి విడత విజయభేరీ బస్సు యాత్రను నిర్వహించింది.
తాజాగా నేటి నుంచి రెండో విడత బస్సు యాత్ర చేపట్టేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది.ఈ సారి బస్సు యాత్ర సుమారు ఏడు నియోజకవర్గాల పరిధిలో కొనసాగనుండగా పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరుకానున్నారని తెలుస్తోంది.
అయితే ఇవాళ్టి యాత్ర తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల మీదగా కొనసాగనుంది.కాగా ఇవాళ్టి బస్సు యాత్రలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొననున్నారు.
రేపు సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ లో జరిగే బస్సు యాత్రకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు.ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.