తెలంగాణ బీజేపీ అభ్యర్థులు తొలి జాబితా మరికాసేపట్లో విడుదల కానుంది.ఈ మేరకు 55 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్టును రిలీజ్ చేయనుంది.
ఇందులో భాగంగా రానున్న ఎన్నికల్లో ఈటల రాజేందర్ గజ్వేల్, హుజురాబాద్ స్థానాల నుంచి బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది.కరీంనగర్ నుంచి బండి సంజయ్, సిరిసిల్ల నుంచి రాణి రుద్రమ, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీకి దిగనున్నారని సమాచారం.
అదేవిధంగా గోషామహల్ నుంచి మరోసారి రాజాసింగే బరిలో నిలబడతారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో పాటు సీనియర్ నేత లక్ష్మణ్ మాత్రం పోటీ నుంచి దూరంగా ఉన్నారని సమాచారం.
ఈ క్రమంలో బీజేపీ ప్రకటించనున్న అభ్యర్థుల తొలి జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.