భూసార పరీక్ష కోసం మట్టిని సేకరించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు..!

వ్యవసాయం( Agriculture ) చేసే నేలను ముందుగా భూసార పరీక్ష చేపించి, ఆ నెలలో ఏ పోషకాలు సంపూర్ణంగా ఉన్నాయో.ఏ పోషకాల కొరత ఉందో తెలుసుకొని తగిన మోతాదులో ఆ పోషకాలను నేలకు అందిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించి మంచి లాభాలు అర్జించవచ్చు.

 Precautions To Be Taken While Collecting Soil For Soil Testing, Agriculture , S-TeluguStop.com

సాగుకు ముందే నేలలో ఉండే పోషకాలు రైతుకు తెలిస్తే.ఒకే రకమైన అధిక ఎరువులు వాడాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల ఎరువులను కావలసిన మోతాదులో ఉపయోగించడానికి వీలు ఉంటుంది.

వర్షాధారంగా సాగు చేసే నేలలలో మూడు సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్ష చేయించుకోవాలి.నీటి వసతి ఉండే నెలలలో ప్రతి మూడు పంటలకు ఒకసారి పరీక్ష చేయించాలి.

భూమిలో సున్నం శాతం, నేల కాలుష్యాన్ని( Soil pollution ) గుర్తించే మట్టి పరీక్ష చేయించుకోవాలి.

Telugu Farmers, Plastic Bag, Soil-Latest News - Telugu

భూ పరీక్ష చేయించుకునే రైతులు ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మట్టి నమూనా ఎలా సేకరించాలి.అంటే నేల రంగు, ఎత్తు, వాలు, చౌడు మరియు పంట దిగుబడులు మొదలగు అంశాలపై పరిశీలన చేసి కంటికి కనిపించే లక్షణాలను బట్టి వివిధ భాగాలుగా విభజించాలి.

Telugu Farmers, Plastic Bag, Soil-Latest News - Telugu

ఇలా సేకరించడం కాస్త కష్టం అనిపిస్తే.జిగ్జాగ్ పద్ధతిలో మట్టి నమూనా సేకరించాలి.ఒక ఎకరం పొలంలో కనీసం 8 నుండి 10 చోట్ల మట్టి నమూనాలు సేకరించాలి.

నేలలో చౌడు లక్షణాలు ఉంటే వాటిని వేరుగా సేకరించి, వేరుగా పరీక్ష పంపాలి.పొలంలో 30 సెంటీమీటర్ల వరకు గుంత తీసి అందులో పై పొర నుంచి కింది పొర వరకు ఒక పక్కన మట్టిని సేకరించాలి.

ఇలా పొలంలోని 10 భాగాల నుంచి దాదాపుగా 500 గ్రాముల మట్టి సేకరించాలి.ఈ సేకరించిన మట్టిలో రాళ్లు, పంటవేర్లు, మొదళ్లు లేకుండా చూసుకొని మట్టిని నీడలో ఆరనివ్వాలి.

ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.ఈ మట్టి నమూనాలను గట్ల దగ్గరలోనూ, పంట కాలువలలోను, చెట్ల కింద ఉన్న పొలభాగం నుంచి మట్టిని సేకరించరాదు.

పొలంలో ఎరువు కుప్పలు వేసిన ప్రాంతం నుండి కూడా మట్టిని సేకరించరాదు.పొలంలో నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు.

భూ పరీక్ష కోసం సేకరించిన మట్టిని ప్లాస్టిక్ బ్యాగ్ ( Plastic bag )లేదా గుడ్డ సంచిలో భద్రపరచుకొని భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి.భూ పరీక్ష లో పొలంలో ఉండే పోషకాల శాతం ఎంతో తెలుస్తుంది.

దానిని బట్టి రైతులు ఎరువుల విషయంలో జాగ్రత్తలు తీసుకొని వ్యవసాయం చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube