భూసార పరీక్ష కోసం మట్టిని సేకరించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు..!
TeluguStop.com
వ్యవసాయం( Agriculture ) చేసే నేలను ముందుగా భూసార పరీక్ష చేపించి, ఆ నెలలో ఏ పోషకాలు సంపూర్ణంగా ఉన్నాయో.
ఏ పోషకాల కొరత ఉందో తెలుసుకొని తగిన మోతాదులో ఆ పోషకాలను నేలకు అందిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించి మంచి లాభాలు అర్జించవచ్చు.
సాగుకు ముందే నేలలో ఉండే పోషకాలు రైతుకు తెలిస్తే.ఒకే రకమైన అధిక ఎరువులు వాడాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల ఎరువులను కావలసిన మోతాదులో ఉపయోగించడానికి వీలు ఉంటుంది.
వర్షాధారంగా సాగు చేసే నేలలలో మూడు సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్ష చేయించుకోవాలి.
నీటి వసతి ఉండే నెలలలో ప్రతి మూడు పంటలకు ఒకసారి పరీక్ష చేయించాలి.
భూమిలో సున్నం శాతం, నేల కాలుష్యాన్ని( Soil Pollution ) గుర్తించే మట్టి పరీక్ష చేయించుకోవాలి.
"""/" /
భూ పరీక్ష చేయించుకునే రైతులు ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మట్టి నమూనా ఎలా సేకరించాలి.
అంటే నేల రంగు, ఎత్తు, వాలు, చౌడు మరియు పంట దిగుబడులు మొదలగు అంశాలపై పరిశీలన చేసి కంటికి కనిపించే లక్షణాలను బట్టి వివిధ భాగాలుగా విభజించాలి.
"""/" /
ఇలా సేకరించడం కాస్త కష్టం అనిపిస్తే.జిగ్జాగ్ పద్ధతిలో మట్టి నమూనా సేకరించాలి.
ఒక ఎకరం పొలంలో కనీసం 8 నుండి 10 చోట్ల మట్టి నమూనాలు సేకరించాలి.
నేలలో చౌడు లక్షణాలు ఉంటే వాటిని వేరుగా సేకరించి, వేరుగా పరీక్ష పంపాలి.
పొలంలో 30 సెంటీమీటర్ల వరకు గుంత తీసి అందులో పై పొర నుంచి కింది పొర వరకు ఒక పక్కన మట్టిని సేకరించాలి.
ఇలా పొలంలోని 10 భాగాల నుంచి దాదాపుగా 500 గ్రాముల మట్టి సేకరించాలి.
ఈ సేకరించిన మట్టిలో రాళ్లు, పంటవేర్లు, మొదళ్లు లేకుండా చూసుకొని మట్టిని నీడలో ఆరనివ్వాలి.
ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.ఈ మట్టి నమూనాలను గట్ల దగ్గరలోనూ, పంట కాలువలలోను, చెట్ల కింద ఉన్న పొలభాగం నుంచి మట్టిని సేకరించరాదు.
పొలంలో ఎరువు కుప్పలు వేసిన ప్రాంతం నుండి కూడా మట్టిని సేకరించరాదు.పొలంలో నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు.
భూ పరీక్ష కోసం సేకరించిన మట్టిని ప్లాస్టిక్ బ్యాగ్ ( Plastic Bag )లేదా గుడ్డ సంచిలో భద్రపరచుకొని భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి.
భూ పరీక్ష లో పొలంలో ఉండే పోషకాల శాతం ఎంతో తెలుస్తుంది.దానిని బట్టి రైతులు ఎరువుల విషయంలో జాగ్రత్తలు తీసుకొని వ్యవసాయం చేయవచ్చు.
షాకింగ్ వీడియో: కదులుతున్న రైలులో రీల్ చేస్తూ చెట్టుకు ఢీకొన్న యువతీ.. చివరకు ఏమైందంటే?