సోనియా అగర్వాల్ (Sonia Agarwal) ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కేవలం 29 ఏళ్లకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి అక్క,అమ్మ పాత్రల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ డబ్బు కోసం సినిమాల్లో నటించాల్సి వచ్చింది.
ఈమె 7/జి బృందావన్ కాలనీ (7/G Brindavan colony) సినిమాలో నటించిన సమయంలో చాలామంది ఈమెకు అభిమానులు అయ్యారు.
అలాంటి సోనియా అగర్వాల్ కోలివుడ్ డైరెక్టర్ అయిన సెల్వ రాఘవన్ ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది .అయితే వీరి పెళ్లి సమయంలో సోనియా తల్లి ఆ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోకు అని ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా సెల్వ రాఘవన్ ని పెళ్లి చేసుకుంది.కానీ పెళ్లయ్యాక కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి.
అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది ఇలాంటి గొడవలు పెట్టుకోవడం కామన్.
ఒకే ఇండస్ట్రీకి చెందిన భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చిన సంగతి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీ కపుల్స్ మధ్యన మనం చూసే ఉంటాం.అయితే సెల్వ రాఘవన్ (Selva Raghavan) తాను తెరకెక్కించే ప్రతి సినిమాలో ఉండే హీరోయిన్లతో చాలా క్లోజ్ గా ఉండడంతో సోనియా కి అస్సలు నచ్చేది కాదు.
కానీ తన భర్తకు బుద్ధి చెప్పాలని అప్పట్లో స్టార్ హీరోగా కోలీవుడ్ లో పేరున్న శింబు(Simbu) తో సీక్రెట్ గా పబ్బులు, పార్టీలు అంటూ తిరగడం మొదలు పెట్టిందట.
ఇక ఈ విషయం తెలుసుకున్న సెల్వరాఘవన్ పరువు మొత్తం తీసేస్తున్నావ్ అంటూ సోనీయా అగర్వాల్ (Sonia Agarwal ) ని రక్తం వచ్చేలా కొట్టాడట.దాంతో కోపంతో మీరు చేస్తే తప్పులేదు కానీ నేను చేస్తే తప్పు వచ్చిందా అంటూ సెల్వరాఘవన్ ని ఎదిరించి మాట్లాడంతో ఇద్దరు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి వెళ్ళాయట.ఇక అప్పట్లో వీరి విషయం తారస్థాయికి చేరింది.
అంతే కాదు మీడియాలో వీరి రిలేషన్ పై రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి.ఇక అలాంటి సమయంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోవడం మంచిదని సెల్వరాఘవన్ తల్లిదండ్రులు విడాకులు తీసుకోమని చెప్పారట.
కానీ ఈ విషయంలో సోనియా అగర్వాల్ తల్లి మాత్రం విడాకులు వద్దని చెప్పినప్పటికీ మాత్రం పంతం పట్టుదలతో ఉన్న సోనియా తన భర్తకి విడాకులు ఇచ్చేసింది.ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే బి గ్రేడ్ సినిమాల్లో అంతేకాకుండా కోలీవుడ్ సీరియల్స్ లో నటిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తుంది.ఇక సెల్వ రాఘవన్ సోనియా అగర్వాల్ తో విడాకులు వచ్చిన వెంటనే తన అసిస్టెంట్ డైరెక్టర్ అయిన గీతాంజలి (Geethanjali) ని పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు.