రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదనీ, దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు.
దేశానికే దిక్సూచిగా….తెలంగాణ వైద్య, ఆరోగ్యం నిలుస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన దినం ఇది.ఒకే సారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం.సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.శుక్రవారం సిఎం కేసీఆర్ చేతులమీదుగా 9 మెడికల్ కాలేజీలు ప్రగతి భవన్ నుండి వర్చువల్ పద్దతిలో ప్రారంభమయ్యాయి.
సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం.
కానీ ఈ కార్యక్రమం చాలా ఆత్మసంతృప్తి కలిగే గొప్ప సన్నివేశం.ఎందుకంటే పరిపాలన చేతకాదు అని ఎగతాళి చేసిన పరిస్థితులను చూశాం.
అటువంటి తెలంగాణలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం.ఈ సంవత్సరంలో దాదాపు 24 వరకు చేరుకున్నాం.
గతంలో ఐదు మెడికల్ కాలేజీలు ఉంటే.ఇవాళ ఆ సంఖ్య 26కు చేరింది.
వచ్చే విద్యా సంవత్సరానికి 8 కాలేజీలు నూతనంగా ప్రాంరంభం కాబోతున్నాయి.వీటికి కేబినెట్ ఆమోదం కూడా లభించిందని సీఎం కేసీఆర్ తెలిపారు.2014లో 2850 మెడికల్ సీట్లు ఉంటే 2023 నాటికి 8515 మెడికల్ సీట్లు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా వైద్యశాఖ మంత్రి, కార్యదర్శిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.85 శాతం మెడికల్ సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కాలని పటిష్టంగా పోరాటం చేసి హైకోర్టులో విజయం సాధించాం.అది గొప్ప విజయం.
ప్రయివేటు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ద్వారా సంవత్సరానికి 10 వేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేయబోతున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, రోగ నిరోధక శక్తి ఉండాలంటే.
తెల్ల రక్త కణాలు ఏ విధంగా పని చేస్తాయో.తెలంగాణ ఉత్పత్తి చేయబోయే తెల్ల కోట్ డాక్టర్లు రాష్ట్రానికే కాదే.
దేశ ఆరోగ్య వ్యవస్థను కూడా కాపాడుతారని కేసీఆర్ వివరించారు.ఇందులో ఎవరికి సందేహం లేదు.
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది.విద్యుత్ రంగంతో పాటు సాగు, తాగునీటి రంగంలో అద్భుతాలు సాధించాం.
దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం.గంజి కేంద్రాలతో విలసిల్లిన ఉన్న పాలమూరు జిల్లాలో ఇప్పుడు వ్యవసాయం పరుగులు పెట్టింది.
పాలమూరు ప్రాజెక్టు ప్రారంభించుకోబోతున్నాం.ఒక్క కాలేజీ లేని పాలమూరులో ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయి.
ఇది గొప్ప విజయం.నల్లగొండలో మూడు కాలేజీలు వచ్చాయి.
మారుమూల జిల్లాలైన ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలు.అలా అడవి బిడ్డలు నివసించే ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు స్థాపించుకొని అద్భుతాలు సృష్టించబోతున్నామని కేసీఆర్ తెలిపారు.
ఒక దేశం కావొచ్చు.రాష్ట్రం కావొచ్చు.
ఎక్కడైతే వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో.అక్కడ తక్కువ మరణాలు, నష్టాలు సంభవిస్తాయని కేసీఆర్ తెలిపారు.
దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మెడికల్ కాలేజీలతో పాటు అద్భుతమైన ఆస్పత్రులను కూడా తీసుకువస్తున్నాం.వందలాది బెడ్స్‌తో మెడికల్ ఫెసిలిటీ వస్తుంది.
వైద్యారోగ్య శాఖ చాలా విజయాలు సాధించింది.దేశంలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ.
ఇది మన సాధించిన ఘనత.రాష్ట్రం ఏర్పడే నాటికి 17 వేల పడకలు ఉంటే.
ఇప్పుడు 34 వేల పడకలకు చేరుకున్నాం.మరో 6 హాస్పిటల్స్ నిర్మాణంలో ఉన్నాయి.
వరంగల్‌లో అద్భుతమైన హాస్పిటల్ నిర్మాణం జరుగుతోంది.హైదరాబాద్‌కు నలువైపులా టిమ్స్ నిర్మిస్తున్నాం.
గచ్చిబౌలి, ఎల్బీ నగర్, అల్వాల్, ఎర్రగడ్డలో 1000 పడకల చొప్పున హాస్పిటల్స్ నిర్మిస్తున్నాం.నిమ్స్‌ను మరో 2 వేల పడకలతో విస్తరిస్తున్నాం.
ఆస్పత్రుల్లో పడకల సంఖ్య 50 వేలకు చేరుకోబోతోంది.ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖను అభినందిస్తున్నాను అని కేసీఆర్ స్పష్టం చేశారు.
కరోనా టైంలో ఆక్సిజన్ చాలా అవసరం ఉండే.దాన్ని గుణపాఠంగా తీసుకొని ఈరోజు వైద్యారోగ్య శాఖ మంత్రి నేతృత్వంలో 500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు.ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోనేందుకు మౌలిక సదుపాయాలు కల్పించుకున్నాం.50 వేల పడకలను ఆక్సిజన్ బెడ్స్‌గా తీర్చిదిద్దుకుంటున్నాం.10 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి.పారా మెడికల్ సిబ్బందికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది.
మెడికల్ కాలేజీలకు అనుబంధంగా.ప్రతి జిల్లాలో నర్సింగ్ కాలేజీలు, పారా మెడికల్ కోర్సులు పెట్టాలని చెప్పాం.
వాటికి కూడా చర్యలు తీసుకుంటున్నారని సీఎం తెలిపారు.ఈ సందర్భంగా *ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.
ఈరోజు రాష్ట్ర చరిత్రలో సుదినం.ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారి.
ఇది సీఎం కేసిఆర్ పట్టుదలకు నిదర్శనమన్నారు రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని ఆయన మార్గ నిర్దేశంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించామన్నారు.గత సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించి తెలంగాణ కొత్త రికార్డు సృష్టించింది.
ఈ సంవత్సరం మన రికార్డును మనమే అధిగమించామన్నారు.ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతం.
ఇది గొప్ప రికార్డు.దేశంలోని మిగితా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 57 శాతం సీట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయన్నారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకోమెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు.ఒకప్పుడు బెంగాల్ ఆలోచిస్తుంది.
దేశం అచరిస్తుంది అనే నానుడి ఉండేది.దాన్ని తిరగరాసిన ఘనత సీఎం కేసిఆర్ ది.ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్‌కాలేజీ అని సీఎం కేసీఆర్ సంకల్పిస్తే.దేశం మొత్తం అదే దారిలో నడుస్తున్నది.
ఇప్పుడు తెలంగాణ అచరిస్తుంది.దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు.
ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.సాధించుకున్న రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ దన్నారు.
ఈరోజు అడ్మిషన్లు పొందిన వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు.ఇంత గొప్ప పవిత్ర యజ్ఞంలో నాకూ భాగస్వామ్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్పారు.
ఈ సందర్భంగా కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం…జిల్లాల్లో నేటి నుండి నూతన మెడికల్ కాలేజీలు నూతనంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో…వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ ఏ ఎం రిజ్వీ, వైద్య విద్య సంచాలకులు రమేశ్ రెడ్డి, వైద్యశాఖ సిఎం వోఎస్డీ డా.గంగాధర్, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీ.సీ కరుణాకర్ రెడ్డి, టిఎస్ ఎం ఐ డీసీ ఎం.డీ, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.వీరితో పాటు ఎంపీలు దామెదర్ రావు, రాములు,కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధునూధనాచారి, శేరి సుభాష్ రెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, ఎమ్మెల్యేలు విప్ రేగాకాంతారావు, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.
కమిట్ మెంట్ కు నిదర్శనం జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటే: మంత్రి కే తారక రామారావు వైద్య విద్య పటిష్టత తో పాటు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభత్వానికి ఉన్నకమిట్ మెంట్ కు నిదర్శనం
జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటేనని మంత్రి కే తారక రామారావు అన్నారు.
మెడికల్ కాలేజీ ల ప్రారంభోత్సవ కార్యక్రమంకు సిరిసిల్ల మెడికల్ కాలేజీ నుండి రాష్ట్ర మంత్రి శ్రీ కే తారక రామారావు హాజరయ్యారు.
సిఎం మెడికల్ కాలేజీలను ప్రారంభించి ప్రసంగం ఇచ్చిన అనంతరం మంత్రి శ్రీ కే తారక రామారావు మెడికల్ కాలేజీ ల అధ్యాపకులు, వైద్య విద్యార్థులతో మాట్లాడారు.స్వరాష్ట్రం ఏర్పాటైన వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఏటా 10 వేల మంది విద్యార్థులు వైద్య విద్య పూర్తి చేసుకుని డాక్టర్ లుగా బయటకు వస్తున్నారని చెప్పారు.దేశంలో 33 శాతం మంది వైద్య విద్యార్థులు ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే వస్తున్నట్లు తెలిపారు.1993 లో నేను బయాలజీ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎంసెట్ రాస్తే 1600 ర్యాంకు వచ్చిందని….అయినా మెడిసిన్ సీట్ రాలేదన్నారు.మా అమ్మకు డాక్టర్ కావాలని…నాన్నకు ఐఏఎస్ కావాలని ఉండేదన్నారు.ఆ రెండూ కాకుండా ప్రజాప్రతినిధి అయ్యాయని చెప్పారు.ఇప్పుడు 10 వేల ర్యాంకు వచ్చినా తెలంగాణలో మెడికల్ సీటు వస్తుందన్నారు.
ఈ ప్రాంతంలో 2009 సంవత్సరంలో డిగ్రీ కాలేజ్ పంచాయతీ ఏర్పాటు ఉండేది అన్నారు.సిరిసిల్లలో పెట్టాలని, వేములవాడలో పెట్టాలని డిమాండ్ వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్యలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.
తెలంగాణ వచ్చాక మెడికల్ కళాశాల, నర్సింగ్ కాలేజ్ ,జేఎన్టీయూ ,వ్యవసాయ కళాశాలతో పాటు ఆక్వా హబ్ ను కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.కొత్త మెడికల్ కాలేజీ లో చేరిన విద్యార్థులు 6 నెలలు ఏమైనా చిన్న ఇబ్బందులు ఉన్న సహకరించాలని చెప్పారు.
విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.వైద్యులు ప్రజల ప్రాణాలు కాపాడే రక్షకులు అని.వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చే ప్రజలు దేవుళ్ళ తోపాటు వైద్యులను కూడా మొక్కుతారన్నారు.అంతటి పవిత్రమైన వృత్తి వైద్యులదన్నారు.
వైద్య వృత్తిలో రాణిస్తూ తెలంగాణకు దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి , సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య,మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పి అఖిల్ మహాజన్,అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్ , గౌతమ్ రెడ్డి , మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు
.