తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Droupadi Murmu ) G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రపంచ నాయకులు, అతిథులకు ‘భారత్ మండపం’లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.దీనికి దేశాధినేతలు, అతిథులందరూ సాంప్రదాయ భారతీయ దుస్తుల్లో హాజరయ్యారు.
భారతీయ సంస్కృతి పట్ల గౌరవాన్ని చూపించేందుకు వారు ఇలా చేశారు.ఈ విందుకు వచ్చిన వారిలో ఒకరైన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా పర్పుల్ ఎత్నిక్ సూట్‌తో పాటు గోల్డెన్ దుపట్టా ధరించారు.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా( Fumio Kishida ) భార్య యుకో కిషిడా పింక్ కలర్ బ్లౌజ్‌తో కూడిన గ్రీన్ కలర్ శారీ కట్టి అందరి కళ్లు తనవైపే తిప్పుకున్నారు.దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా భార్య త్షెపో మోట్సెపే ఇండో-వెస్ట్రన్ దుస్తులను గజ్రాతో ధరించారు.మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ నల్లటి బంద్‌గాలా సూట్‌లో వచ్చారు.అతని భార్య కోబితా జుగ్‌నాథ్ చీర కట్టుకున్నారు.బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ముత్యాల హారంతో కూడిన చీరను కట్టి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి చీర, బ్లౌజ్ వంటి ట్రెడిషనల్ టచ్‌తో కూడిన మోడ్రన్ ఔట్‌ఫిట్‌తో అందంగా కనిపించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) డయాస్‌లో అతిథులకు స్వాగతం పలికారు.ప్రధాని మోదీ తెల్లటి కుర్తా, చురీదార్‌తో పాటు బ్లూ జాకెట్‌ను ధరించగా, రాష్ట్రపతి ముర్ము లేత గోధుమరంగు చీరను కట్టుకున్నారు.ఇకపోతే ఢిల్లీలో జరుగుతున్న G20 సదస్సుకు హాజరైన ప్రపంచ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించిన ప్యూర్ వెజ్ మెనూలో రకరకాల ఆహారాలను ఆస్వాదించారు.ఈ మెనూలో కాశ్మీరీ కహ్వా, డార్జిలింగ్ టీ, ముంబై పావో, జాక్‌ఫ్రూట్ గాలెట్ వంటి వంటకాలను అందించడం ద్వారా భారతదేశ గొప్ప వంటల వారసత్వాన్ని ప్రదర్శించారు.