కుటుంబ బాధ్యతలను మరిచి తాగుడుకు బానిసైన భర్త రోజు పీకలదాకా మద్యం సేవించి భార్యను ఇష్టం వచ్చినట్లు వేధిస్తూ ఉండడంతో.సహనం కోల్పోయిన భార్య చివరికి భర్తను చిత్రహింసలకు గురిచేసి చంపేసిన ఘటన మెదక్ జిల్లా( Medak ) తుఫ్రాన్ మండలం ఘణపుర్ లో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఘణపుర్ లో వెంకటేష్, విజయ దంపతులు నివాసం ఉంటున్నారు.వెంకటేష్ కుటుంబ బాధ్యతలను మరిచి తాగుడుకు బానిస అయ్యాడు.
తాగేందుకు డబ్బులు ఇవ్వాలని విజయ ను పీడించేవాడు.విజయ ఎంత వారించినా వెంకటేష్( Venkatesh ) తన ప్రవర్తనను మార్చుకోకుండా ఇష్టం వచ్చినట్లు భార్య విజయ ను కొడుతూ వేధించేవాడు.
తాజాగా శనివారం రోజు వెంకటేష్ పీకలదాకా మద్యం సేవించి( Alcohol ) భార్యతో గొడవపడ్డాడు.గొడవ తారస్థాయికి చేరడంతో సహనం కోల్పోయిన విజయ, భర్తను తాళ్లతో బంధించి, కళ్ళల్లో కారం కొట్టింది.
అంతటితో ఆగకుండా వేడి నీళ్లను వెంకటేష్ శరీరంపై పోసింది.ఆ బాధలు భరించలేకపోయిన వెంకటేష్ గట్టిగా అరవడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన వెంకటేష్ ను తుఫ్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.చికిత్సకు స్పందించక వెంకటేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

అనంతరం వెంకటేష్ మృతదేహాన్ని( Dead Body ) పోస్ట్ మార్టానికి తరలించారు.ఈ హత్యకు పాల్పడ్డ విజయ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.తాగొచ్చిన భర్తను హతమార్చడంలో విజయ బంధువులు కూడా సహకరించారని, ఆ బంధువులతో కలిసి విజయ, తన భర్త వెంకటేష్ ను తాళ్లతో బంధించినట్లు స్థానికులు చెబుతున్నారు.తర్వాత అందరూ కలిసి విచక్షణారహితంగా కొట్టారని స్థానికులు పోలీసులకు తెలిపారు.
వెంకటేష్ హత్య కేసులో అనుమానిత వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.