సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసు బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి విధుల నిర్వహణపై డిఐజి ఏ.ఎస్.
చౌహన్, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ సలహాలు సూచనలు అందించారు.సీఎం పర్యటన సందర్భంగా ప్రటిష్టమైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఐజీ చౌహాన్ తెలిపారు.
సీఎం బందోబస్తు విధుల నిర్వహణకు చేసిన వివిధ జిల్లాల పోలీస్ సిబ్బందికి బందోబస్తు వీధుల్లో పాటించవలసిన విధినియమాలు,సలహాలు,సూచనలతో పాటు రూట్ మ్యాప్ లో బందోబస్తు విధులు మొదలగు అంశాలపై డిఐజికి ఎస్పీ వివరించారు.బందోబస్తు నిర్వహణకు 10 జిల్లాల నుండి పోలీస్ సిబ్బంది నిధులు నిర్వర్తిస్తున్నారు.3000 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారని ఎస్పీ తెలిపారు.ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వహించాలని వాహనాల మళ్లింపు, ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని,ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలి, ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలి ఎస్పీ సూచించారు.
ముఖ్యమంత్రి హెలికాప్టర్లో దిగనున్న ప్రదేశాన్ని ఎస్వి డిగ్రీ కళాశాల ప్రదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది,హెలిప్యాడ్ భద్రత సంబంధించి కలెక్టర్,ఎస్పీ,ఇంటలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు ముందస్తు పరిశీలన చేశారు.పర్యటనలో భాగంగా ముఖ్యమైన వాహనాల కాన్వాయ్ ను జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ పరిశీలించారు.
కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించి అన్ని ప్రారంభ కార్యాలయాల ప్రదేశాలను చేరుకున్నారు.సీఎం పర్యటన సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమాల ప్రాంగణాలు,రూటు మ్యాపులను ఇంటలిజెంట్ సెక్యూరిటీ వింగ్ అధికారులు తనిఖీ చేశారు.
సెక్యూరిటీ వివరాలను బందోబస్తు వివరాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఇంటలిజెన్స్ సెక్యూరిటీ అధికారులకు వివరించారు.
ఎస్వీ కళాశాల వెనకాల ద్వారం నుండి మెడికల్ కలశాలకు చేరుకుని ప్రారంభించడం, అనంతరం ఎన్టీఆర్ పార్క్ మీదుగా సద్దల చెరువు ప్రక్కనుండి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు చేరుకోవడం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నుండి సంతోష్ బాబు చౌరస్తా మీదుగా బీఆర్ఎస్ భవనానికి చేరుకోని ప్రారంభించడం,అనంతరం ఎస్పీ కార్యాలయం ప్రారంభం అక్కడ నుండి జనగాం ఎక్స్ రోడ్ మీదుగా,కొత్త బస్టాండ్ సర్వీస్ రోడ్,వసుందర షాపింగ్ మాల్ ముందు నుండి ఎక్స్టెన్షన్ 60 ఫీట్ల రోడ్డు నుండి కలెక్టర్ కార్యాలయంకు వెళ్లి ప్రారంభించడం,60 ఫీట్ల రోడ్డు మీదుగా నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుకు చేరుకుని ఈనాడు కార్యాలయం వద్ద నుండి సభా స్థలానికి చేరుకోవడం,అనంతరం ఈనాడు కార్యాలయం నుండి పిఎస్ఆర్ సెంటర్, కోర్టు చౌరస్తా,మినీ ట్యాంక్ బండ్ మీదుగా ఎస్వీ కళాశాల వద్ద ఉన్న హెలిప్యాడ్ కు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.