డీజే టిల్లు సినిమా( DJ Tillu Movie ) బాక్సాఫీస్ ను షేక్ చేయగా ఈ సినిమాలో నటించిన నేహాశెట్టికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ముందే నేహాశెట్టి పలు ప్రాజెక్ట్ లలో నటించినా ఈ సినిమా స్థాయిలో ఆ సినిమాలకు ప్రశంసలు అయితే రాలేదు.
టిల్లు స్క్వేర్( Tillu Square ) లో అనుపమను తీసుకోగా నేహాశెట్టి నటించిన బెదురులంక 2012 మూవీ అతి త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.
బెదురులంక సినిమా( Bedurulanka Movie ) కోసం నేహాశెట్టి ఏకంగా అరకోటి పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది.అరకోటిలో 40 లక్షల రూపాయలు పారితోషికం కాగా 10 లక్షల రూపాయలు జీఎస్టీ అని తెలుస్తోంది.ఈ మొత్తం పర్సనల్ స్టాఫ్ కోసం ఖర్చు చేసే మొత్తం అదనంగా ఉండనుంది.
నేహాశెట్టి ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే ఆమె కెరీర్ కు మేలు జరుగుతుందని చెప్పవచ్చు.
నేహాశెట్టిని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న ఈ హీరోయిన్ రాబోయే రోజుల్లో స్టార్ స్టేటస్ ను అందుకుంటానని ఫీలవుతున్నారు.
బెదురులంక 2012 ఏకంగా 13 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది.కార్తికేయకు కూడా ఈ సినిమా సక్సెస్ కీలకమనే సంగతి తెలిసిందే.
ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ను ఏ విధంగా షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.తర్వాత ప్రాజెక్ట్ లతో కార్తికేయకు భారీ విజయాలు దక్కాలని కార్తికేయ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కార్తికేయ( Hero Karthikeya ), నేహాశెట్టి ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.నేహాశెట్టి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మాత్రమే అమె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.