అలనాటి స్టార్ హీరోయిన్స్ లో ఇప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు.ఆ తక్కువమంది లో ఒకరు రంభ.
ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘ఆ ఒక్కటి అడక్కు( Aa Okkati Adakku )’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన రంభ ఆ సినిమా హిట్ తో వరుసగా టాలీవుడ్ లో అవకాశాలను సంపాదించింది.చూస్తూ ఉండగానే అతి తక్కువ సమయం లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
తెలుగు , తమిళం, హిందీ మరియు మలయాళం భాషల్లో అందరి స్టార్ హీరోల సరసన నటించి పాన్ ఇండియన్ హీరోయిన్ గా ఎదిగింది.ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్స్ క్యాటగిరీ లో ఈ రేంజ్ కి వెళ్లిన మొట్టమొదటి అమ్మాయి ఒక్క రంభ మాత్రమే.
అయితే రంభ ఎదుగుదల చాలా మంది హీరోయిన్స్ కి మింగుడు పడని విషయం వాస్తవం.ఈ విషయాన్నీ స్వయంగా రంభనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.
![Telugu Bollywood, Nagma, Rajendra Prasad, Ravi Kishan, Tollywood-Movie Telugu Bollywood, Nagma, Rajendra Prasad, Ravi Kishan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/08/Aa-Okkati-Adakku-tollywood-bollywood-Ravi-Kishan-Nagma-rajendra-prasad.jpg)
అప్పట్లో రంభ కి బాలీవుడ్ లో కూడా అవకాశాలు మెండుగా వచ్చాయి.సల్మాన్ ఖాన్ , షారుఖ్ ఖాన్ , అనిల్ కపూర్ వంటి హీరోలతో చాలా సినిమాల్లో నటించింది.అలాగే భోజపురి లో కూడా చాలా చిత్రాల్లో నటించింది.రేస్ గుర్రం సినిమా విలన్ రవి కిషన్( Ravi Kishan ) అందరికీ తెలుసు కదా, అతను భోజపురి లో అప్పట్లో పెద్ద సూపర్ స్టార్ హీరో.
రంభ అతనితో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.అయితే రంభ అంటే పడని ఇద్దరు హీరోయిన్స్ ఆమెకి రవి కిషన్ తో అఫైర్స్ ఉన్నట్టుగా పుకార్లు పుట్టించారు.
అంతే కాదు లవ్ ఫెయిల్యూర్ అవ్వడం తో రంభ సూసైడ్ అట్టెంప్ట్ కూడా చేసింది అంటూ వార్తలు వచ్చాయి.అయితే ఇదే విషయాన్నీ రంభ ని ఒక ఇంటర్వ్యూ లో అడగగా ఆమె దానికి చెప్పిన సమాదానాలు అప్పట్లో సంచలనం రేపింది.
![Telugu Bollywood, Nagma, Rajendra Prasad, Ravi Kishan, Tollywood-Movie Telugu Bollywood, Nagma, Rajendra Prasad, Ravi Kishan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/08/Aa-Okkati-Adakku-tollywood-bollywood-Ravi-Kishan-Nagma.jpg)
ఆమె మాట్లాడుతూ ‘ఇది కేవలం పుకార్లు మాత్రమే.ఈ పుకార్లు పుట్టించింది ఎవరో కూడా నాకు బాగా తెలుసు.ఇద్దరు ప్రముఖ హీరోయిన్స్ ఈ పని చేసారు.వాళ్ళని నా జీవితం లో ఎప్పుడూ కలిసింది కూడా లేదు, కానీ నేనంటే ఎందుకు వాళ్లకు అంత పగ అనేది మాత్రం అర్థం కాలేదు.
రవి కిషన్ నాకు పెద్ద అన్నయ్య తో సమానం, అలాంటి మనిషి తో నాకు ఇలాంటి లింక్స్ పెట్టడం చాలా బాధేసింది.ఇలాంటి రూమర్స్ వస్తున్నాయనే నేను సినిమాల నుండి తప్పుకున్నాను’ అంటూ రంభ మాట్లాడిన మాటలు అప్పట్లో సంచలనం రేపాయి.
అప్పట్లో ప్రముఖ హీరోయిన్ నగ్మా రవి కిషన్( Nagma ) తో ప్రేమాయణం నడిపిన సంగతి ప్రతీ ఒక్కరికి తెలుసు.ఆమెనే ఇలాంటి పుకార్లు పుట్టించింది అనే రూమర్ కూడా ఇండస్ట్రీ లో ఉంది.
.