తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు( Telangana Heavy Rains ) కురుస్తున్న సంగతి తెలిసిందే.కురుస్తున్న వర్షాలకు కొంతమంది గల్లంతు కూడా అయ్యారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అవుతున్నాయి.
వరదల్లో గల్లంతైన పలువురు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా భారీ వర్షాల కారణంగా ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో మంచిర్యాల జిల్లా రాంనగర్, బాలాజీ నగర్ వాసులు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్( MLA Nadipelli Diwakar ) ఇల్లు ముట్టడించారు.
ప్రతి ఏడాది ఈ రీతిగానే వర్షపు నీరు.ఇళ్లలోకి చేరుకుంటున్న క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్యే దగ్గర తమ ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ హామీ ఇచ్చారు.ఇదిలా ఉంటే భద్రాచలం వద్ద గోదావరి( Godavari 0 మరోసారి ఉగ్రరూపం దాల్చింది.
గురువారం సాయంత్రం కాస్త నెమ్మదించిన గాని శుక్రవారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 52 అడుగులకు చేరుకుంది.ఈ క్రమంలో ప్రవాహం మరో అడుగు దాటితే మూడో ప్రమాదక హెచ్చరిక చేయాలనే ఆలోచనలో భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఉన్నారు.
శనివారం ఉదయం నాటికి 56 అడుగులకు పైగా నీటిమట్టం చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.దీంతో అధికార యంత్రాంగం చుట్టుప్రక్కల గ్రామాలలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.