అనుష్క శెట్టి( Anushka Shetty ).చాలా రోజుల తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులతో పాటు చేయడానికి సిద్ధమవుతోంది.
నిజానికి బాహుబలి ( Baahubali )తర్వాత అనుష్కకి మంచి రోజులు లేవనే చెప్పాలి ఎందుకంటే ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఆమె ఒకటి రెండు సినిమాల్లో కనిపించినా కూడా అవి అంతగా జనాల్లోకి వెళ్లలేదు పైగా ఆమె అప్పటికి బరువు కూడా తగ్గకపోవడంతో ఆమెపై ప్రేక్షకుల్లో కొంత నిరాశక్తి కూడా కనిపించింది.ఆగస్ట్ 4వ తేదీన ఆమె నటించిన సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి.
ప్రస్తుతం అనుష్క సినిమా నుంచి ఈ థర్డ్ సింగిల్ విడుదలవబోతోంది అంటూ ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ చేసింది.లేడీ లాక్ అంటూ సాగే ఈ పాట కి సంబంధించిన పోస్టర్స్ చూసి అనుష్క అభిమానులు పండగ చేసుకుంటున్నారు.ఎందుకంటే ఈ పోస్టర్స్ లో అనుష్క మునుపటి మాదిరిగా చాలా సన్నగా కనిపిస్తుంది సైజ్ జీరో సినిమా( Size Zero )కి ఆమె ప్రయోగం చేసి లావైన సంగతి మన అందరికీ తెలిసిందే.కానీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పోస్టర్స్ చూస్తే ఆమె నిజంగా సన్నబడిందా అనే ఒక క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తుంది.
నిజానకి కాస్తా టెక్నాలజీ పైన అవగాహన ఉన్నవారు మాత్రం ఆ పోస్టర్స్ ని చూస్తే అవి అనుష్క నిజమైన ఫోటోలేనా లేక కాస్త టెక్నాలజీ సహాయంతో చెక్కిన ఫోటోల అనేది అర్థమవుతుంది.సోషల్ మీడియా మాత్రం మెజారిటీ పీపుల్ ఆమె అంతగా సన్నగా అవ్వలేదని, ఆ ఫోటోలో అలా కనిపించే విధంగా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారని, అనుష్క సన్నబడటం ఇక సాధ్యం కాదని, ఎన్ని ఏళ్లుగా ప్రయత్నిస్తున్న ఆమె బరువు తగ్గకపోవడం పై అనేక రకాల కామెంట్స్ చేస్తున్నారు.మరి నెటిజెన్స్ అంటున్న మాట నిజమా కాదా తెలియాలంటే ఆగస్టు 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.