రష్యా తరుపున ఉక్రెయిన్ తో యుద్ధం చేసేందుకు క్రిమినల్స్ రంగంలోకి?

రష్యా-ఉక్రెయిన్( Russia ) యుద్ధం మొదలై ఏడాదిన్నర కావస్తోంది.ఈ క్రమంలో అమెరికా ఆంక్షలకు భయపడకుండా పుతిన్ యుద్ధాన్ని సమర్ధవంతంగానే కొనసాగిస్తున్నాడు.

 Criminals To Fight With Ukraine On Behalf Of Russia , Criminals , Latest News,t-TeluguStop.com

మరోవైపు పాశ్చాత్య దేశాలను నమ్ముకున్న ఉక్రెయిన్ కూడా అంతే ధీటుగా రష్యాకి సమాధానం చెబుతోంది.ఐతే పెద్ద దేశమైన రష్యా కేవలం కొన్ని వారాల్లోనే ఈ యుద్ధాన్ని ముగుస్తుంది అనుకుంటే ఇన్నాళ్లపాటు ఇంకా కొనసాగిస్తూ ఉండడం ఒకింత ఆశ్చర్యకరమే.

అదేవిధంగా రష్యాకు ఉక్రెయిన్( Ukraine ) తొందరగానే లొంగిపోతుందని అనుకున్నప్పటికీ.అమెరికా, బ్రిటన్, జర్మనీ, కెనడా తదితర దేశాలు ఇచ్చే సాయంతో ఏడాదిన్నగా ఉక్రెయిన్ పోరు సాగించడం విశేషమే.

Telugu Behalf, Criminals, Latest, Russia, Telugu Nri, Ukraine, Vladimir Putin-Te

ఇకపోతే ఈ యుద్ధం విషయమై రష్యా ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.అవును, ఈ యుద్ధంలో రష్యా తరుపున పోరాడేందుకు అనుమానిత దోషులు, నేరస్థులతో ఒప్పందం చేసుకునేందుకు రక్షణ మంత్రిత్వశాఖను అనుమతించే చట్టాన్ని, రష్యా దిగువసభలో బుధవారం ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది.ఇక రష్యా పార్లమెంట్ కూడా దాదాపుగా ఈ చట్టానికి అనుమతి ఇవ్వనుంది.రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరప్ లో పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించడానికి రష్యా అడుగులు వేస్తోన్నట్టు కనబడుతోంది.<div class="mid
dlecontentimg”>

Telugu Behalf, Criminals, Latest, Russia, Telugu Nri, Ukraine, Vladimir Putin-Te

ఇకపోతే, దేశద్రోహం, లైంగిక నేరాలు, రాజ్యద్రోహం, టెర్రరిజం కేసుల్లో నిందితులుగా ఉన్నవారు మాత్రం ఈ కాంట్రాక్ట్ కిందికి రారని తేల్చి చెబుతోంది రష్యా.ఉక్రెయిన్ లో పోరాడేందుకు జైళ్లలో నుంచి ఖైదీలను రిక్రూట్ చేసుకోవడానికి రష్యా కిరాయి ఆర్మీ వాగ్నెర్ టీంకు గతంలో అనుమతి ఉన్నప్పటికీ ఫిబ్రవరిలో ఇది ఆగిపోయింది.ఐతే రక్షణ మంత్రిత్వ శాఖ మరోసారి ఈ ప్రక్రియను చేపట్టిందని అక్కడి జైలు హక్కుల కార్యకర్తల మాట.ఇక త్వరలోనే వారిని బరిలో దించే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు ఈ అంశంపై నాటో దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి వుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube