అఖిల్ సినిమా ఏజెంట్( Agent Movie ) ప్లాప్ అవ్వగానే నిర్మాత అనిల్ తమ సినిమా ప్లాప్ కి అఖిల్ కి ఎలాంటి సంబంధం లేదు.బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా సినిమా నిర్మించడం వల్లనే ప్లాప్ అయ్యింది అంటూ ఆ పాపం సినిమా తీసిన డైరెక్టర్ పైన తోసాడు.
ఇక ఆచార్య సినిమా( Acharya Movie ) టైం లో కూడా అంతే.ఆ చిత్రం ఘోరంగా పరాజయం పాలివ్వడానికి కారణం దర్శకుడే అంటూ స్వయంగా చిరంజీవి నిందలు వేసాడు.
సెట్ కి వచ్చాక డైలాగ్స్ రాయడం, సీన్స్ రాయడం వంటివి చేసాడు అంటూ కొరటాల ను అడ్డంగా బుక్ చేసాడు.
ఇక రామబాణం సినిమా( Ramabanam Movie ) విషయంలోనూ అంతే సినిమా చాల ఎక్కువ భాగం ఫుటేజ్ షూట్ చేసాడు అని, ఏకంగా అది 16 నిముషాలు కట్ చేయాల్సి వచ్చిందని, ఆ సీన్స్ అన్ని కూడా డీలిటెడ్ సీన్స్ అంటూ యూట్యూబ్ లో వదులుతున్నామని నిర్మాత చెప్పాడు.
అంత సినిమా రష్ పెరుగుతుంటే నిర్మాత కానీ హీరో కానీ ఎందుకు నోరు మెదపలేదు అనేది పెద్ద ప్రశ్న.సినిమా విషయంలో ఎప్పుడు అగ్ర తాంబూలం హీరోలకే దక్కుతుంది.
కానీ సినిమా ప్లాప్ అయితే మాత్రం ఆ నింద డైరెక్టర్ పైన పడుతుంది.

రెమ్యునరేషన్ విషయంలో ఉండే హడావిడి సినిమా ప్లాప్ అయితే ఒప్పుకోవడం లో ఎందుకు హీరోలు తీసుకోరు.పైగా రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు మినహా ఏ డైరెక్టర్ కూడా హీరో చెప్పిన మాట వింటున్నవారే.సినిమా రష్ చూసి ఇది ఇలా చెయ్యి, అది అలా చెయ్యి అంటూ ఆర్డర్స్ వేసేవారు.
మరి అన్ని చూసుకొని, అందరు ఒకే చెప్పాకనే సినిమాను థియేటర్ లో వదులుతున్నారు.

అంత చేసిన తర్వాత సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే అది కేవలం దర్శకుడు తప్పు అన్నట్టుగా హీరోలు, నిర్మాతలు మీడియా ముందు చెప్పడం నిజంగా సిగ్గు చేటు.నిర్మాతలు, హీరోలు చెప్పిన కథనే దర్శకుడితో తీయించే రోజులు ఇవి.పాత చింత కాయ పచ్చడి సినిమాలతో, హీరోయిజం అనే భజన తో సినిమాలు తీయించుకుటూ కథలో వందల మార్పులు చేర్పులు చేయించి అది అస్సలు ఎందుకు పనికి రాకుండా చేసి చేతులు దులుపుకుంటున్నారు.ఇది అంత ప్రేక్షకులు గమనిస్తున్నారు.తప్పు ఎవరిదో తెలుసుకోలేంత పిచ్చి వాళ్ళు కాదు.తస్మాత్ జాగ్రత్త.