సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)పేరు ఈ మధ్యకాలంలో రాజకీయాలలో కూడా ఎక్కువగా వినపడుతుంది.కొందరు నాయకులు ఎన్టీఆర్ ప్రమేయం లేకుండానే తన పేరును రాజకీయాలలో వాడుకుంటున్నారు.
ముఖ్యంగా వైఎస్ఆర్సిపి నాయకుడు అయినటువంటి కొడాలి నాని తరచూ ఎన్టీఆర్ పేరును ప్రస్తావనకు తీసుకువస్తున్నారు.అయితే తాజాగా దేవినేని అవినాష్ సైతం ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడమే కాకుండా ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ (Hari Krishna) తనకు తండ్రి సమానులంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.
![Telugu Devineniavinash, Hari Krishna, Jr Ntr, Kodali Nani, Nandamuritaraka, Ntrl Telugu Devineniavinash, Hari Krishna, Jr Ntr, Kodali Nani, Nandamuritaraka, Ntrl](https://telugustop.com/wp-content/uploads/2023/05/devineni-avinash-gets-trolled-of-wishing-on-ntr-lakshmi-pranathi-wedding-day-detailsd.jpg)
ఈ విధంగా ఎన్టీఆర్ ప్రమేయం లేకుండా ఆయన పేరును తరచూ ప్రస్తావనకు తీసుకురావడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.తాజాగా దేవినేని అవినాష్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల పెళ్లిరోజు (Wedding Day) సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్ట్ చేశారు.అయితే ఈ పోస్ట్ పై ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతూ దేవినేని అవినాష్ ( Devineni Avinash) ను భారీగా ట్రోల్ చేస్తున్నారు.దేవినేని అవినాష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…
![Telugu Devineniavinash, Hari Krishna, Jr Ntr, Kodali Nani, Nandamuritaraka, Ntrl Telugu Devineniavinash, Hari Krishna, Jr Ntr, Kodali Nani, Nandamuritaraka, Ntrl](https://telugustop.com/wp-content/uploads/2023/05/devineni-avinash-gets-trolled-of-wishing-on-ntr-lakshmi-pranathi-wedding-day-detailss.jpg)
మా కుటుంబానికి ప్రత్యక్ష దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు , తండ్రి సమానులైన హరికృష్ణ గారి కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.మీరు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో గడపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ఈయన ఎన్టీఆర్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.అయితే ఈ పోస్ట్ పై పలువులు తెలుగుదేశం పార్టీ నేతలు స్పందిస్తూ కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సింపతి కోసమే ఇలాంటి పోస్ట్ లు చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.
అలాగే హరికృష్ణ గారు తండ్రి సమానులు అని చెప్పడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా హరికృష్ణ గారి గురించి ఇలాంటి కామెంట్స్ చేయలేదే అంటూ ట్రోల్ చేస్తున్నారు.