ట్రయల్ రూమ్‌లో డోనల్డ్ ట్రంప్‌ నన్ను రేప్ చేశాడు: జీన్ కెరల్‌

డోనల్డ్ ట్రంప్‌( Donald Trump ) గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.ఈ అమెరికా మాజీ అధ్యక్షుడు గురించి తెలియని ప్రజానీకం ఉండదని చెప్పుకోవాలి.

 Donald Trump Raped Me In The Trial Room Jean Keral , Donald Trump ,raped Me,tri-TeluguStop.com

ఒక అధ్యక్షుడు కంటే కూడా తన వ్యక్తిగత వివాదాల వల్లనే డోనల్డ్ ట్రంప్ అందరికీ సుపరిచితుడు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.అసలు విషయంలోకి వెళితే, సరిగ్గా 3 దశాబ్దాల క్రితం కాలమిస్టు జీన్ కెరల్‌( Columnist Jean Keral )పై అత్యాచారం చేశారనే ఆరోపణల విషయంలో సివిల్ విచారణను ట్రంప్ ఎదుర్కొంటున్నారు.

కాగా ఈ కేసుని విచారించబోయే జ్యూరీని న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో మంగళవారం నియమిస్తారు.

కాగా ఈ విషయమై ట్రంప్ స్పందిస్తూ… పబ్లిసిటీ కోసమే ఆమె ఆరోపణలు ఇలా చీప్ చేస్తున్నారని అన్నారు.మాన్‌హాటన్‌లోని ఓ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌( Departmental Store )లో తనపై అత్యాచారం చేశారనే కెరల్ ఆరోపణలను ట్రంప్ పూర్తిగా తిరస్కరిస్తున్నారు.అయితే ఇది క్రిమినల్ కేసు కానప్పటికీ ఇందులో ట్రంప్ దోషిగా తేలితే పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చని అంటున్నారు.

ఈ కేసులో కెరల్ విజయం సాధిస్తే, ట్రంప్ లైంగిక దాడి కేసు( Trump sexual assault case )లో దోషిగా నిర్ధారణ కావడం తొలిసారి అవుతుంది.ఇక ఇలాంటి కేసు అతనికి కొత్తకాదు.

దాదాపు డజనుకుపైగా ఇలాంటి కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

అవును, ట్రంప్‌ను వెంటాడుతున్న ఇలాంటి ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి.వీటిలో పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు చెల్లింపులు కావచ్చు, 2021 జనవరి 6నాటి క్యాపిటల్ అల్లర్లు కావచ్చు… ఇంకా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి.ఇకపోతే, వచ్చే సంవత్సరం అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ మళ్లీ పోటీచేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.

ఇలాంటి తరుణంలో ఇలాంటి కేసులు పెట్టడం పట్ల ఆయన తన ప్రత్యర్థులను తప్పుబడుతున్నారు.కావాలనే తనపైన లేనిపోని అభాండాలు వేసి తన పేరుని చెడగొట్టడానికి యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube