కీర్తి సురేష్ బంగారు మనసు... దసరా టీంకు గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన మహానటి!

వెండితెర మహానటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి కీర్తి సురేష్( Keerthi Suresh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కథ ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమాలను ఎంపిక చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి విజయాలను అందుకుంటున్న కీర్తి సురేష్ తాజాగా నాని( Nani ) హీరోగా నటిస్తున్న దసరా( Dadsara ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

 Keerthy Suresh Has A Heart Of Gold The Great Actress Gave Gold Coins To The Das-TeluguStop.com

ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకొని మార్చి 30వ తేదీ పాన్ ఇండియా( Paan India ) స్థాయిలో విడుదల కానుంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున చిత్ర బృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఇక ఇందులో కీర్తి సురేష్ వెన్నెల(Vennela) అనే పాత్రలో నటించబోతున్నారు.ఈ సినిమాలో ఈమె డీ గ్లామర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరికెక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) అనే కొత్త డైరెక్టర్ పనిచేశారు ఇక ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి( Sudhakar Cherukuri ) ఎంతో ప్రతిష్టత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు.

ఇక ఈ సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సమయంలో తాజాగా నటి కీర్తి సురేష్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది.మహానటి తర్వాత మళ్లీ అలాంటి నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర రావడం, షూటింగ్‌లో తనకు అన్ని విధాలా సహకరించినందుకు దసరా టీం మొత్తానికి ఈమె బంగారు కాయిన్స్( Gold Coins ) బహుమతిగా అందజేసే తన బంగారు మనసును చాటుకున్నారు.ఇలా టీం 130 మందికి ఈమె ఒక్క గ్రామ్ గోల్డ్ కాయిన్ బహుమానంగా ఇచ్చారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube