భారత దేశం నుంచి పెద్ద ఎత్తున ఏటా విదేశాలకు చదువుకునేందుకు వెళ్లే వారు మాత్రమే కాకుండా, ఉపాధి కోసం వెళ్లే వారి సంఖ్య కూడా బాగా ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా అరబ్ దేశాలకు పెద్ద ఎత్తున మహిళలు వెళ్తుంటారు.
అక్కడకు వెళ్లి 2 లేదా 3 సంవత్సరాలు ఉంటారు.అక్కడ ఇంటి పని, వంట పని చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు.
వాటిని తమ ఇళ్లకు పంపి, ఇక్కడ ఇల్లు కట్టించుకోవడం, పిల్లలకు పెళ్లి చేయడం వంటివి చేస్తుంటారు.అయితే మహిళలు అక్కడ చాలా ఇబ్బందులు పడుతుంటారు.
అరబ్ షేక్‌ల ఇళ్లలో వెట్టి చాకిరీ చేస్తూ, వాళ్లు పెట్టే హింస భరిస్తుంటారు.ఇదే కోవలో అమెరికాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.
దాదాపు 8 ఏళ్లు ఇద్దరు మహిళలను ఇంట్లో బంధించి వెట్టి చాకిరీ చేయించుకుంది.ఆ ఎన్ఆర్ఐ మహిళ పెట్టిన టార్చర్‌కు వాళ్ల ఆరోగ్యం చెడిపోయింది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అమెరికాలోని న్యూజెర్సీలో ఎన్ఆర్ఐ మహిళ సాహ్ని ఉంది.తన వద్ద ఇంట్లో పని చేసేందుకు ఇద్దరు మహిళలను ఇండియా నుంచి 2013లో రప్పించుకుంది.అప్పటి నుంచి 2021 వరకు వారిని ఇంట్లోనే బంధించింది.
వారితో నానా రకాల వెట్టి చాకిరీ చేయించుకుంది.అంతేకాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా తన ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ ఆ ఇద్దరు మహిళలతో పని చేయించింది.దీంతో వారి ఆరోగ్యం పాడైంది.

ముఖ్యంగా ఓ మహిళకు ఏకంగా బ్రెయిన్ ఆన్యూరిజమ్ అనే వ్యాధి బారిన పడింది.ఎట్టకేలకు 8 ఏళ్లకు ఆ ఎన్ఆర్ఐ మహిళ బండారం బట్టబయలైంది.కోర్టులో నేరాన్ని సాహ్ని అంగీకరించింది.
ఇద్దరు మహిళలకు 6,42,212ల డాలర్ల పరిహారం అందిస్తానని కోర్టులో పేర్కొంది.అంతే కాకుండా 2 లక్షల డాలర్లు వెచ్చించి, వ్యాధి బారిన పడిన మహిళకు చికిత్స చేయిస్తానని అంగీకరించింది.
ఇవే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా పన్నుల ఎగవేతకు పాల్పడిన నేరంలో ప్రభుత్వానికి కూడా జరిమానా కట్టింది.