బ్రేకప్ తర్వాత అలా అయిపోతున్నానంటూ దీప్తి సునైనా కామెంట్.. వైరల్ స్టోరీ?

ఎవరైనా ఒకరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి మనస్పర్దాలతో వదిలేస్తే ఆ తర్వాత ఒంటరి జీవితం అనేది  చాలా కష్టంగా ఉంటుంది.ఏం చేసినా కూడా ప్రేమించిన వ్యక్తి గుర్తుకు వస్తూనే ఉంటారు.

 Deepti Sunaina Shocking Comments On Breakup With Shanmukh Jaswanth Details, Deep-TeluguStop.com

వారి జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ గుర్తుకు చేసుకోకుండా ఏదో ఒక పని చేస్తూ వాటిని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు.అదే విషయాన్ని తలుచుకోకుండా కొత్త కొత్తగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

ఏదో ఒక విధంగా కొత్త జీవితంలోకి మారిపోవాలన్నట్లుగా ఉంటారు.

అలా సామాన్యులే కాదు ఒక హోదాలో ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు.

ఎందుకంటే ప్రేమ అనేది అలాంటిది.అయితే ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు కూడా తమకు బ్రేకప్ జరిగితే ఆ వెంటనే రిఫ్రెష్ అవ్వడానికి ప్రయత్నిస్తారు.

ఇప్పటికే సమంత విడాకుల తర్వాత రిఫ్రెష్ అయింది.తన లైఫ్ ఏంటో తాను చూసుకుంటుంది.

తనలో వచ్చిన మార్పును గుర్తించింది.ఇక అటువంటిదే దీప్తి సునైనా కూడా ఎదుర్కొంది.

Telugu Bigg Boss, Deepthisunaina, Deepti Sunaina, Deeptisunaina, Siri Hanumanthu

ఈమె కూడా బ్రేకప్ తర్వాత సోషల్ మీడియా ద్వారా రిఫ్రెష్ అయింది.చాలావరకు తన ఎమోషనల్ ని కంట్రోల్ చేసుకుంది.బయటికి చెప్పుకోలేక బాధపడింది.ఇక అవన్నీ ఒక కల లాగా మర్చిపోయి ఇప్పుడు కొత్త లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.తన కెరీర్ ఏంటో తాను చూసుకుంటుంది.దీప్తి సునయన ఇండస్ట్రీకి అడుగుపెట్టకముందు సోషల్ మీడియాలో డబ్స్మాష్   వీడియోస్ చేస్తూ అందరి దృష్టిలో పడింది.

అంతేకాకుండా యూట్యూబ్ లలో కూడా షార్ట్ ఫిలిమ్స్ చేసింది.కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేసింది.ఆ సమయంలోనే తనకు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్  జశ్వంత్ తో పరిచయం ఏర్పడింది.ఆయనతో కలిసి చాలా కవర్ సాంగ్స్ చేసింది.

అలా వారిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది.ఇక దీప్తి సునైనకు బిగ్ బాస్ లో కూడా అవకాశం రావడంతో బుల్లితెరపై తన పరిచయాన్ని పెంచుకుంది.

Telugu Bigg Boss, Deepthisunaina, Deepti Sunaina, Deeptisunaina, Siri Hanumanthu

ఇక బిగ్ బాస్ తర్వాత.షణ్ముఖ్ తో మరింత క్లోజ్ గా మూవ్ అయ్యింది.ఎక్కడికి వెళ్లినా అతనిని వెంట పట్టుకొని వెళ్ళేది.అలా ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయారు.ఇక షణ్ముఖ్ కూడా బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది.ఆ సమయంలో దీప్తి సునయన షన్ను మీద ఉన్న ప్రేమను బయట పెట్టింది.

దీంతో ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి అందరూ ఫిదా అయ్యారు.

కానీ షన్ను బిగ్ బాస్ హౌస్ లో మరో కంటెస్టెంట్ సిరి తో బాగా క్లోజ్ గా మూవ్ అవ్వటంతో.

వెంటనే దీప్తి అతడికి బ్రేకప్ చెప్పేసింది.ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ పెద్ద షాక్ ఇచ్చింది.ఇక అప్పటినుంచి వీరిద్దరూ దూరంగా ఉంటూ ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్లుగా బతుకుతున్నారు.ఇక దీప్తి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటిలాగే ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేస్తూ, కవర్ సాంగ్స్ చేస్తూ గడుపుతుంది.

Telugu Bigg Boss, Deepthisunaina, Deepti Sunaina, Deeptisunaina, Siri Hanumanthu

అయితే తాజాగా మరోసారి తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసింది దీప్తి.అందులో ఓ నెటిజన్.బ్రేకప్ తర్వాత నీలో నువ్వు కనిపెట్టిన చేంజ్ ఏంటి అని అడగటంతో.వెంటనే దీప్తి రోబో అయిపోతున్నట్లు అనిపిస్తుంది అని సమాధానం ఇచ్చింది.అంటే ఒక మెషిన్ లాగా తన పని తాను చేసుకుంటూ పోతున్నట్లుగా తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube