ప్రముఖుల పేర్ల ముసుగులో జరుగుతున్న మోసాలు రోజురోజుకీ పెట్రేగిపోతున్నాయి.ఇండియాలో ఇప్పటికే ఇలాంటి మోసాలు వెలుగు చూసాయి.
కాగా తాజాగా ఇద్దరు ఎన్నారైలు కూడా ఇదే పంథా ఎంచుకున్నారు.వీరు వాట్సాప్‌లో భారత ఉపరాష్ట్రపతిగా నటిస్తూ మోసం చేయాలనుకున్నాను.
ఈ ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) యూనిట్ అరెస్టు చేసింది.వీరిలో ఒకరైన గగన్‌దీప్ సింగ్ ఇటలీలో నివసిస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టయ్యాడు.

మరో వ్యక్తి అశ్విని కుమార్‌ను పంజాబ్‌లోని పాటియాలాలో అరెస్టు చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఇటలీలోని ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేయడంతో నకిలీ ఖాతా గురించి గుర్తించారు.ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడానికి ముందు పోలీసులు సాంకేతిక వివరాలపై పని చేశారు.ఆపై సోదాలు నిర్వహించారు.సీనియర్ బ్యూరోక్రాట్‌ల గురించి ఇంటర్నెట్ నుంచి తనకు సమాచారం వచ్చిందని, ఉపరాష్ట్రపతి ఫొటోను ఉపయోగించి నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించానని గగన్‌దీప్ అంగీకరించాడు.

సీనియర్ ప్రభుత్వ అధికారుల నుంచి సహాయం కోసం అతను నకిలీ ఖాతాను ఉపయోగించాడు.గగన్‌దీప్ నుంచి ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.జమ్మూకి చెందిన గగన్‌దీప్ సింగ్ 2007లో ఇటలీకి వెళ్లాడు.
కాగా ఈ వ్యవహారం ఇప్పుడు మన దేశంలోనే కాకుండా ఎన్ఆర్ఐలు ఉంటున్న అన్ని దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఇకపోతే వాట్సాప్ ఫంటి సోషల్ మీడియా సైట్స్‌లో ప్రభుత్వ అధికారులు మెసేజ్‌లు కనిపిస్తే వాటిని నమ్మకూడదు.