మెగాస్టార్ చిరంజీవి మొన్న సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో ఆయన తదుపరి సినిమా భోళా శంకర్ పై చాలా ఆశలు ఉన్నాయి.
వాల్తేరు వీరయ్య సినిమా విడుదల అయిన వెంటనే భోళా శంకర్ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న భోళా శంకర్ సినిమా లో కీర్తి సురేష్ కీలక పాత్రలో కనిపించబోతుంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇదే ఏడాది సమ్మర్ చివర్లో విడుదల చేయాలని మెగా స్టార్ భావిస్తున్నాడు.అది కుదరకుంటే దసరా కు సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
మొత్తానికి ఈ ఏడాదిలో భోళా శంకర్ సినిమా విడుదల అవ్వడం పక్కా అని తేలిపోయింది.అయితే భోళా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి నటించబోతున్న సినిమా ఏంటీ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆ మధ్య మారుతి దర్శకత్వంలో ఒక సినిమాను.వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమాను ఇంకా ఇద్దరు ముగ్గురు యంగ్ డైరెక్టర్స్ దర్శకత్వంలో కూడా సినిమాలను చేసేందుకు చిరంజీవి కమిట్ అయ్యాడు.కానీ అవేవి ఇప్పుడు వెంటనే పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు.మారుతి ప్రస్తుతం ప్రభాస్ సినిమా తో బిజీగా ఉన్నాడు.వెంకీ కుడుముల ఇటీవలే నితిన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సమయంలోనే చిరంజీవి తదుపరి సినిమా విషయమై ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక సినీ ఫ్యాన్స్ కూడా చిరంజీవి తదుపరి సినిమాలు ఎప్పుడు అంటూ ఆసక్తి గా ఎదురు చూస్తూనే ఉన్నారు.