జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో పడిపయారు.ముందుకు పోలేక వెనకడుగు వేయలేక సతమతం అవుతున్నారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మాటలకు పదును పెట్టారు.అయితే పొత్తుల విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేక పోతున్నట్టు కనిపిస్తోంది.
అధికార వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని శపథం చేసిన పవన్.ఇప్పుడు కొంచెం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది.
కమ్యూనిస్టులను వదిలి కాషాయ గూటికి చేరిన దగ్గరి నుంచి వారితోనే కొనసాగుతూ వస్తున్నారు.ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జతకట్టడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.
దాదాపు 30 సీట్ల దాకా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.బాబు మాత్రం తనకు ఇబ్బంది లేని 20 చోట్ల ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
దాంతో పవన్ కొత్త ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.
టీడీపీలో కూడా.
అధినేత పై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.జనసేనికు ఎక్కువ సీట్లు ఇస్తే.
అది టీడీపీకి పెద్ద మైనస్ గా మారుతోందని భయపడుతూ ఉన్నారు.దానికి తోడు జనసేన పార్టీ.
వైసీపీ కేడర్ కంటే టీడీపీ కేడర్ నే ఎక్కువగా చీల్చుతోంది.కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనను వదులుకోవడానికి బాబు సద్దంగా లేరు.
కానీ బీజేపీని మాత్రం చేర్చుకోవడానికి ససేమీరా అంటున్నారు.బీజేపీ సైతం ఈ సారి మొంకి పట్టు పట్టుకుని కూర్చుంది.
టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చేశారు.దాంతో జనసేన అధినేత పవన్ లో కొత్త టెన్షన్ మొదలయింది.
అటు బీజేపీని వదల్లేక.ఇటు టీడీపీతో కొనసాగలేక సతమతమవుతు ఉన్నారు.
రెండు పార్టీలకు దూరంగా తానే స్వంతంగా రంగంలోకి దిగాలని సైతం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.తన ఒక్క అవకాశం నినాదం ప్రజల్లోకి ఇప్పుడిప్పుడే ఎక్కుతోంది.ఇలాంటి టైంలో టీడీపీతో జతకడితే.తన పార్టీ ఉనికికే ఎసరు వస్తోందని ఆలోచిస్తున్నారు.జనసేన నేతలు కూడా పవన్ కు అదే సలహా ఇస్తున్నట్టు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ కూడా రెండు పార్టీలకు చెడకుండా స్వంతంగా రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది అనేదానిపై సర్వే చేయిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
మరి పవన్ సర్వేలో వచ్చే రిజల్ట్స్ ఆధారంగా ఆయన నిర్ణయం ఉండబోతోందని తెలుస్తోంది.
టీడీపీతో పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలా.? లేక బీజేపీ అండదండలు తీసుకుని ఆ పార్టీతో కలసి వెళ్లాలా.? అని వపన్ ఆలోచిస్తున్నారు.ఇలాంటి టైంలో టీడీపీ అదినేత పట్టు విడువక పోవడంతో.ఏం చేయాలో తోచని స్థితిలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది.మరి ఆయన సర్వే రిపోర్టు వస్తే గానీ ఆయన సరైన నిర్ణయం తీసుకునే అవకాశం లేనది విశ్లేషకులు చెబుతున్నారు.