టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా సెకండ్ జనరేషన్ హోమ్‌పాడ్‌ను లాంచ్ చేసింది.ఇది ఐకానిక్ డిజైన్‌లో వస్తుంది.
ఈ హోమ్‌పాడ్ అద్భుతమైన లిజనింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం అడ్వాన్స్‌డ్ ఆడియో క్వాలిటీని అందిస్తుంది.ఇందులో లీనమయ్యే ఆడియో ట్రాక్‌లకు కూడా మద్దతు ఉంటుంది.
ఇది యాపిల్ ఇన్నోవేషన్స్, సిరి ఇంటెలిజెన్స్‌తో వస్తుంది.కొత్త హోమ్‌పాడ్ మైక్రోఫోన్‌ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను వినడం ద్వారా,
ఆ ఫీడ్‌బ్యాక్‌ను స్వయంగా కాలిబ్రేట్ చేయడం ద్వారా ఆటోమేటిక్ రూమ్ కరెక్షన్ చేయగలదు.
ఈ సెకండ్ జనరేషన్ హోమ్‌పాడ్ యాపిల్ S7 ప్రాసెసర్‌తో వస్తుంది.ఈ చిప్ కంప్యూటేషనల్ ఆడియో, రియల్ టైమ్ ట్యూనింగ్‌లో బాగా సహాయపడుతుంది.
కొత్త హోమ్‌పాడ్ స్టీరియో పేరింగ్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది.అంటే వీటిలో రెండింటిని ఒక రూమ్‌లో ఉంచి టీవీ లేదా పీసీకి స్టీరియో స్పీకర్‌లుగా ఉపయోగించడం సాధ్యమవుతుంది.
ఈ హోమ్‌పాడ్ యాపిల్ టీవీ 4K డాల్బీ అట్మోస్ ఆడియోను కూడా ప్లే చేయగలదు.ఈ హోమ్‌పాడ్‌లో టెంపరేచర్, హుమిడ్ సెన్సార్లు కూడా ఉంటాయి.ఇవి మీ పరిసరాల వాతావరణ పరిస్థితిని క్షణాల్లోనే అంచనా వేసి చెప్పగలవు.హోమ్‌పాడ్ 2nd జెన్ ఫిబ్రవరి 3 నుంచి రూ.32,900 ధరకి అందుబాటులో ఉంటుంది.ఇకపోతే కొత్త హోమ్‌పాడ్ కలర్-కోఆర్డినేటెడ్ బ్రైడెడ్ ఛార్జింగ్ కేబుల్‌తో వస్తుంది.
అమెజాన్, గూగుల్, లేదా సోనోస్ వంటి కంపెనీలు స్మార్ట్ స్పీకర్లను లాంచ్ చేసే బాగా పాపులర్ అయ్యాయి.యాపిల్ కూడా దాదాపు ఐదు సంవత్సరాలుగా హోమ్‌పాడ్ సిరీస్‌లో స్మార్ట్ స్పీకర్‌లను తయారు చేస్తోంది.కానీ ఇండియాలో ఇవి అంతగా పాపులర్ కాలేదు.మరి కొత్తగా తీసుకొచ్చిన హోమ్‌పాడ్ అయినా ఇండియన్ యూజర్లకు నచ్చుతుందో లేదో చూడాలి.