తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మర్రి శశిధర్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్నంతవరకు… టీ కాంగ్రెస్ బాగుపడదని విమర్శించారు.
ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనని సస్పెండ్ చేసే అధికారం పీసీసీకి లేదని అన్నారు.ఇదే సమయంలో తాను చేసిన ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేసి వేణుగోపాల్ ఇద్దరూ వివరణ ఇవ్వలేదని గుర్తు చేశారు.
కాంగ్రెస్ లో రేవంత్ ఉన్నంతవరకు పార్టీ పరిస్థితి ఈ రీతిగానే ఉంటుందని వ్యాఖ్యానించారు.తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని జోష్యం చెప్పారు.
దీంతో మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వర్గం వర్సెస్ సీనియర్ లు అనే పరిస్థితి నెలకొంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కొంతమంది రాజీనామాలకు కూడా పాల్పడటం జరిగింది.దీంతో పరిస్థితి చేయి దాటి పోయే తరుణంలో కాంగ్రెస్ హై కమాండ్ దిగ్విజయ్ సింగ్ నీ రంగంలోకి దింపి టీకాంగ్రెస్ పార్టీ గొడవలను… చక్కబెట్టారు.
పార్టీలో ఎటువంటి గొడవలు లేవని అంత సద్దుమణిగాయి అనీ కూడా దిగ్విజయ్ ప్రకటన చేయడం జరిగింది. పార్టీ నుండి సస్పెండ్ చేయడం కాదు… తానే పార్టీకి రాజీనామా చేసినట్లు శశిధర్ రెడ్డి తెలియజేశారు.
ఈ క్రమంలో మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.