ఎమ్మెల్సీ ఎన్నికలకి దూరం, సార్వత్రికకి సై! చంద్రబాబు నిర్ణయం!

ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది.ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీలుగా పోటీ చేయాలని చాలా మంది సిద్ధం అవుతున్నారు.

దానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ఓ వైపు తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలకి సన్నద్ధం అవుతున్నాయి.

అయితే ఏపీలో అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికలకి దూరంగా వుండాలని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ తరుపున ఎవరు బరిలో నిలవారని తాజాగా క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు.

తమ దృష్టంతా రాబోయే సార్వత్రిక ఎన్నికలపై వుందని తేల్చేసారు.ఇక సార్వత్రిక ఎన్నికలకి రెడీ అవుతున్న చంద్రబాబు జిల్లాల వారీగా పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, పార్టీ క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తున్నారు.

Advertisement

అలాగే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే అభ్యర్ధులకి ఖరారు చేస్తున్నారు.ఇదిలా వుంటే తాజాగా మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు.

ఏపీలో జగన్ కుల రాజకీయాలు చేస్తూ మరో బీహార్ లా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, అలాగే కేసీఆర్ తీసుకొచ్చి ఏపీ ప్రజలపై రుద్దే ప్రయత్నంలో జగన్ వున్నారని విమర్శించారు.కేసీఆర్ జగన్ ని సామంత రాజు చేయాలని చూస్తున్నారని దయ్యబట్టారు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికలలో వైసీపీకి ఏపీ ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు