ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తీయడం పరిపాటే.బాహుబలి, కె జి ఎఫ్ కి మాత్రమే సీక్వెల్స్ రావాలా ? భూత కోలా ఆటకు, పంజుర్లి దేవుడికి సీక్వెల్ రాసుకోవచ్చు.అందులో ఎలాంటి తప్పు లేదు.పైగా కాంతారా చిత్రానికి 15 కోట్ల బడ్జెట్ మాత్రమే ఇచ్చిన హోంబళే ఫిలిమ్స్ వారు పది సినిమాలకు సరిపడా బడ్జెట్ ని సంపాదించారు అందుకే సీక్వెల్ కోసం ఎంతైనా బడ్జెట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు.
మరి కాంతారా సినిమా సృష్టించిన ప్రభంజనం రిపీట్ చేస్తుందా అంటే అనుమానమే.రిషబ్ శెట్టి ని తక్కువ అంచనా వేయడానికి లేదు కాబట్టి ఎలాగైనా ప్రచారం చేసి సినిమాను నడిపించగలడు.
ప్రచారం ఎలా చేయాలో ఎవరైనా సరే రిషబ్ దగ్గరే నేర్చుకోవాలి.
కాంతారా సినిమా ప్రమోషన్ లో కూడా ఇలాంటి ఒక ట్విస్ట్ వాడాడు.
క్లైమాక్స్ షూట్ జరుగుతున్నప్పుడు గుళిగ దేవుడు నాకు ఒక విషయం చెప్పాడు అది నేను ఎవరికి చెప్పను అంటూ ఇంటర్వ్యూ లో చెప్పాడు.అది బాగా వర్క్ అవుట్ అయ్యింది.
ఇక ఇప్పుడు సీక్వెల్ అనగానే టీమ్ అందరిని పిలిచి అంత పాత టీమ్ తోనే అని చెప్పాడు.అంతటితో ఆగకుండా తన నిర్మాత తో సహా మంగుళూరు శివార్లలో ఉన్న కద్రి మంజునాథ గుడిలో భూతకోలా ఉత్సవ ప్రదర్శనలో పాల్గొన్నాడు.

ప్రధాన అర్చకుడు కృష్ణ అడిగ దగ్గర ఆశీర్వాదం తీసుకొని పంజుర్లి దేవుడి అనుగ్రహం కోరాడు.అక్కడ దేవుడి ఆవహించి పంజుర్లి రిషబ్ కి అనుమతి అయితే ఇచ్చాడట అలాగే కొన్ని హెచ్చరికలు చేసాడట.అది కూడా సీక్వెల్ కి సంబంధించి అట.ప్రస్తుతం ఈ విషయం బాగా ప్రచారం లో సాగుతుంది.ఇందులో నిజం ఎంత అనే విషయం తెలియకపోయిన హెచ్చరించింది మాత్రం నిజమేనట.ఇక వర్షాకాలం లోపే షూటింగ్ మొదలు కావాలని సన్నాహాలు చేస్తున్నాడు.ఎంత బడ్జెట్ అయినా పెట్టె హోంబళే వారు ఉన్నారు.అందుకే ఈసారైనా వరాహరూపం లాంటి ఒక తప్పు చేయకుండా, కోర్ట్ లు, కేసులు జోలికి పోకుండా సక్రమంగా సినిమా పూర్తి చేసి మొదటి పార్ట్ కన్నా పెద్ద హిట్ కొట్టాలని కోరుకుందాం.