తీపి కలిగిన ఆహారాలు తినడం వల్ల శరీరానికి చాలా రకాల అనారోగ్య సమస్యలు( Health Problems ) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.అతిగా తీపి తినే వారి శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది.
అయితే చాలామంది కి ఈ ఆలోచన రావచ్చు.ఖర్జూర పండ్లు( Dates ) కూడా తీపిగా ఉంటాయి.
వీటిని తినడం వల్ల తీవ్ర వ్యాధులు వస్తాయని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే వీటిలో శరీరానికి కావాల్సిన సహజ చక్కెర అధిక పరిమాణంలో ఉంటుంది.

అంతే కాకుండా ఇందులోనీ పోషకాలు శరీరానికి అధికంగా లభిస్తాయి.కాబట్టి ఖర్జూర లను ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.అంతే కాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఇది మనల్ని రక్షిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఖర్జూరంలో లభించే అధిక పోషకాలు శరీరంలోని ఎముకలను దృఢంగా చేసేందుకు ప్రముఖ పాత్రను పోషిస్తాయి.
ఇంకా చెప్పాలంటే ఇందులో అధిక పరిమాణంలో క్యాల్షియం( Calcium ), మాంగనీస్, కాపర్ కూడా ఉంటాయి.వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.

ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు ఖర్జూర తినే వారిలో రోగనిరోధక శక్తి( Immunity ) కూడా పెరుగుతుంది.అలాగే ఇది శరీరాన్ని దృఢంగా మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.అంతే కాకుండా ప్రతి రోజు ఖర్జూర తినే వారిలో చర్మ సమస్యలు( Skin Problems ) రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇలా ప్రతిరోజు ఖర్జూర తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా కనబడుతుంది.
శరీర బరువును పెంచుకోవాలనుకునే వారు క్రమం తప్పకుండా ఖర్జూర లను తినడం వల్ల శరీర బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి.
అంతేకాకుండా సులభంగా మంచి శరీర ఆకృతిని పొందుతారు.