Allu arjun controversies : మళ్ళి మళ్ళి వివాదంలో చిక్కుకుంటున్న ఐకాన్ స్టార్….అల్లు అర్జున్ తప్పు చేశాడా?

69వ జాతీయ అవార్డుల విజేతల జాబితాను విడుదల చేసింది ప్రభుత్వం.మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు దేశం అంతటా మారు మ్రోగుతోంది.

69 ఏళ్ళ తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో ఏ ఒక్కరు సాధిచలేని ఘనత మన అల్లు అర్జున్ సొతం అయ్యింది.69వ జాతీయ అవార్డులలో ఉత్తమ నటుడు పురస్కారాన్ని సాధించాడు మన ఐకాన్ స్టార్.ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రయాణంలో సాధించిన విజయాలతో పాటు ఆయన అపజయాలు, వివాదాలను కూడా ఎత్తి చూపుతున్నారు నెటిజన్లు.మరి మన ఐకాన్ స్టార్ ఇరుక్కున్న వివాదాలేమిటో ఇప్పుడు చూదాం.

1.దేశముదురు వివాదం

పూరి జగన్నాధ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో 2007 లో విడుదలైన చిత్రం దేశముదురు.ఈ సినిమాను డి.వి.వి.దానయ్య నిర్మించారు.ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హన్సిక నటించింది.ఈ సినిమాకు అల్లు అర్జున్( Allu arjun ) కి పూర్తి రెమ్యూనిరేషన్ ఇవ్వలేదనే విషయం వివాదానికి దారి తీసింది.

2.పవన్ కళ్యాణ్ తో వివాదం

నీకోరిక కొణిదెల హీరోయిన్ గా నటించిన చిత్రం ఒక మనసు.ఈ సినిమా ఆడియో లాంచ్ ఏవేంటి కి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు మన అల్లు అర్జున్.ఐతే అల్లు అర్జున్ మాట్లాడుతుండగా కొందరు పవన్ కళ్యాణ్ ఫాన్స్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని అరవటం మొదలుపెట్టారు.

ఐతే ఇది పవన్ కళ్యాణ్ ఈవెంట్ కాదని "నేను చెప్పను బ్రదర్" అంటూ మొండి పట్టు పట్టారు అల్లు అర్జున్.దీంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు అల్లు అర్జున్ కి మధ్య వివాదాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి.

3.సరైనోడు వివాదం

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన చిత్రం సరైనోడు.రకుల్ ప్రీత్ సింగ్, కాథరిన్ థెరెసా హీరోయిన్ లుగా నటించారు.ఈ సినిమా పై అప్పట్లో కాపీ రైట్స్ ఆరోపణలు వచ్చాయి.

4.భానుశ్రీ మెహ్రా తో వివాదం

అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు చిత్రంలో హీరోయినిగా నటించారు భానుశ్రీ మెహ్రా( Bhanu Sri Mehra )గుణశేఖర్ దర్శకత్వం వహించారు.

Advertisement

ఐతే ఆ మధ్య అల్లు అర్జున్ ఆమెను ట్విట్టర్లో బ్లాక్ చేసారు.ఈ విషయాన్నీ భానుశ్రీ మెహ్రా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.దాంతో ఆ విషయం పెద్ద కాంట్రవర్సీ కి దారి తీసింది.

5.రాపిడో ఆడ్ వివాదం

బైక్ టాక్సీ యాప్ రాపిడో( Rapido ) అల్లు అర్జున్ తో ఒక ఆడ్ షూట్ చేసింది.ఐతే ఈ ఆడ్ తెలంగాణ ఆర్ టీ సి ని కించపరిచేలా ఉందని గొడవ చేసారు తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంద్యోగులు.దీనికి సంబంధించి అల్లు అర్జున్ కి, రాపిడో కి లీగల్ నోటీసులు కూడా పంపించారు.

వీటితో పాటు జొమాటో యాడ్, శ్రీ చైతన్య విద్య సంస్థల యాడ్ లతో కూడా వివాదాలలో ఇరుక్కున్నారు అల్లు అర్జున్.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు