రాజమౌళి కెరీర్ లో రెండేళ్ల సమయం వృథా.. ఇంత పెద్ద తప్పెలా చేశాడో?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి పేరు ప్రస్తుతం బ్రాండ్ లా మారిపోయింది.తమ సినిమాల ఈవెంట్లకు జక్కన్న హాజరైతే చాలని చాలామంది దర్శకనిర్మాతలు భావిస్తున్నారంటే రాజమౌళి రేంజ్ ఏంటో సులువుగా అర్థం చేసుకోవచ్చు.

 Two Years Wasted In Rajamouli Cine Career Details Here Geos Viral ,rajamouli-TeluguStop.com

రాజమౌళి డిమాండ్ చేస్తే 200 కోట్ల రూపాయలు, 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి సైతం నిర్మాతలు సిద్ధంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.అయితే ఆర్.

ఆర్.ఆర్ సినిమా తర్వాత మహేష్ సినిమాకు ఓకే చెప్పడం వల్ల రాజమౌళి సినీ కెరీర్ లో ఏకంగా రెండేళ్ల సమయం వృథా అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించి ఏడు నెలల సమయం వేర్వేరు రీజన్ల వల్ల వేస్ట్ అయింది.సంక్రాంతి తర్వాత షూట్ మొదలైనా ఈ సినిమా షూట్ వేగంగా జరిగి అనుకున్న సమయానికి ఈ సినిమా థియేటర్లలో రిలీజవుతుందని చెప్పలేం.

2023 సంవత్సరంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూట్ జరిగే అవకాశాలు తక్కువని చెప్పవచ్చు.ఆర్.ఆర్.ఆర్ రిలీజైన వెంటనే రాజమౌళి ఏదైనా చిన్న సినిమాను ప్లాన్ చేసి ఉంటే మాత్రం బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ సినిమా కోసం జక్కన్న ఎక్కువ సమయం కేటాయిస్తూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు.ఈ కామెంట్ల గురించి రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Telugu Mahesh Babu, Rajamouli, Ram Charan, Tollywood, Trivikram-Movie

రాజమౌళి మహేష్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను ఇప్పటికే పూర్తి చేశారని సమాచారం.ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారని తెలుస్తోంది.రాజమౌళి కెరీర్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.జక్కన్నగా పేరు తెచ్చుకున్న రాజమౌళి తర్వాత సినిమాల షూటింగ్ లను కచ్చితంగా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంది.

రాజమౌళితో పని చేయాలని చాలామంది హీరోలు ఆశ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube