జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.కనీసం ఆలివ్ కలర్ షర్ట్ అయినా వేసుకోవచ్చా అంటూ వైసీపీ నేతలకు కౌంటర్ సోషల్ మీడియా వేదికగా ఇచ్చారు.
రెండు రోజుల క్రితమే పవన్ తన ఎన్నికల ప్రచార రథం ‘ వారాహి ‘ ని సోషల్ మీడియా వేదికగా జనాలకు పరిచయం చేశారు.ఈ వాహనం ద్వారానే ఏపీ అంతటా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు, సభలు, సమావేశాలు అన్ని ఈ వాహనం నుంచే నిర్వహించేందుకు పవన్ ఏర్పాట్లు చేసుకున్నారు.
దీనిని ప్రత్యేకంగా పవన్ డిజైన్ చేయించుకున్నారు.పూర్తిగా మిలిటరీ వాహనం మాదిరిగా పవన్ ‘వారాహి ‘ ఉండడం, దీనికి సంబంధించి న వీడియోలు పవన్ సోషల్ మీడియాలో పెట్టడం తదితర వ్యవహారాలపై వైసీపీ నాయకులు సెటైర్లు వేశారు.
వారాహికి వేసిన రంగు ఆలివ్ గ్రీన్ కంటే, పసుపు రంగు వేసుకుంటే మంచిదంటూ మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.మిలటరీ తప్పితే మరో ప్రైవేటు వ్యక్తులు తమ వాహనాలకు ఆలివ్ గ్రీన్ కలర్ వాడడం నిషిద్ధమని, అలాంటిది జనసేన వాహనానికి ఆ రంగు వేస్తే ఎలా అనుమతి వస్తుందని ? జనసేన బండి తెలంగాణలో కూడా నడవదని , అందుకే ఆ వాహనానికి పసుపు రంగు వేసుకుంటే మంచిదంటూ పేర్ని నాని చేసిన కామెంట్స్ పై పవన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.కనీసం ఆలివ్ కలర్ షర్ట్ అయినా వేసుకోవచ్చా అంటూ కౌంటర్ ఇచ్చిన పవన్ గతంలోని వ్యవహారాల పైన స్పందించారు.” మొదట మీరు నా సినిమాలను అడ్డుకున్నారు.ఆ తరువాత విశాఖపట్నం వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రానివ్వలేదు.మంగళగిరిలో పార్టీ ఆఫీస్ నుంచి బయటకు రాకుండా నా కారును అడ్డగించారు.కనీసం నడిచి వెళ్దామంటే నడవనివ్వలేదు.ఇప్పుడు వాహనం రంగు సమస్యగా మారింది.
తర్వాత నన్ను ఊపిరి కూడా తీసుకోవద్దంటారా చెప్పండి.ఏం చేయాలో అంటూ వైసీపీ నేతలకు పవన్ కౌంటర్ ఇచ్చారు.