నాగ్పూర్ మెట్రో ప్రత్యేకంగా ఎక్కడో ఒకచోట వినే వుంటారు.వార్దా రోడ్డులో నిర్మించిన డబుల్ డెక్కర్ వయడక్ట్ సుమారు 3.14 కిలోమీటర్ల విస్తరించి యుంటుంది.ఈ నేపథ్యంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఈ మెట్రో స్థానం సంపాదించుకుంది.
సదరు ధ్రువ పత్రాన్ని నాగ్పూర్ మెట్రో భవన్లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర మెట్రో MD అయినటువంటి బ్రిజేష్ దీక్షిత్ అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమకు ఈ అవార్డ్ లభించి తమ బాధ్యత మరింత పెంచిందని అన్నారు.
ఇంకా అనేక విషయాలు ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
వార్దా రోడ్డులో నిర్మాణం చేయడం అనేది పెద్ద సవాలని, అయితే దాన్ని వారు సునాయాసంగా అధిగమించారని చెప్పుకొచ్చారు.
కాగా నేడు వారి కృషి ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండంతస్తుల ఫ్లైఓవర్ గల మెట్రోగా నాగ్పూర్ మెట్రో ఈ ఘనతను దక్కించుకోవడం విశేషం.ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మెట్రో నిర్మాణాల్లో ఇంత పొడవులో రెండంతస్తుల ఫ్లైఓవర్ ఎక్కడా నిర్మించిన దాఖలాలు లేవు.దీని పొడవు 3.14 కిలోమీటర్లు ఉంటుంది.అంటే రోడ్డుపై రోడ్డు వంతెన ఉండగా దానిపైన మెట్రో నిర్మాణం చేపట్టారన్నమాట.
![Telugu Gunnis, Metro, Nagpur Metro, Nagpur, Latest-Latest News - Telugu Telugu Gunnis, Metro, Nagpur Metro, Nagpur, Latest-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2022/12/metro-station-Nagpur-Metro.jpg )
ఇక నాగ్పూర్ మెట్రో పేరు మీదే గతంలో కూడా ఒక రికార్డు ఉండటం మనం గమనించవచ్చు.ఈ సందర్భంగా నాగ్పూర్ మెట్రో గిన్నీస్ రికార్డు సాధించడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మిక్కిలి సంతోషాన్ని వ్యక్తం చేసారు.ఈ విషయమై తాజాగా ఆయన మహారాష్ట్ర మెట్రోకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా భారత జాతీయ రహదారుల సంస్థకు కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పడం విశేషం.పైన 3.14 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ వయడక్ట్ నిర్మాణం, అలాగే మెట్రో కింద జాతీయ రహదారి నిర్మాణం నిర్మించడం అనేది అద్భుతమని గడ్కరి ఈ సందర్భంగా అన్నారు.