టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే.అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఘట్టమనేని ఫ్యామిలీ సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.ఇప్పటికీ ఆయన మరణ వార్త నుంచి బయటపడలేకపోతున్నారు.
మరి ముఖ్యంగా కృష్ణ తనయుడు మహేష్ బాబు తన తండ్రి మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మను హైదరాబాదులోని జేఆర్సి ఫంక్షన్ హాల్ లో చాలా ఘనంగా నిర్వహించారు.
కాగా సూపర్ స్టార్ పెద్దకర్మ కార్యక్రమానికి ఘట్టమనేని ఫ్యామిలీ అలాగే పలువురు రాజకీయ నాయకులు సినీ ప్రేమికులు హాజరయ్యారు.అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 5 వేలకు మందికి పైగా అభిమానులు వచ్చారు.
సూపర్ స్టార్ పెద్దకర్మను కొడుకు మహేష్ బాబు సాంప్రదాయబద్ధంగా ఘనంగా నివాళులు అర్పించారు.తన తండ్రి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరైన అభిమానులకు మహేష్ బాబు అన్ని సౌకర్యాలను కల్పించారు.
అలాగే రెండు మాంసాహార వంటకాలు, మిగిలిన శాకాహార వంటకాలను జేఆర్సీ ఫంక్షన్ హాలు వారే తయారు చేసారు.అభిమానులతో పాటు సినిమా రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ జనాలు కూడా ఇక్కడకు వచ్చారు.
సినిమా సెలబ్రిటీలు, మీడియా కోసం ఎన్ కన్వెన్షన్ లో భోజనాలు ఏర్పాటు చేసారు.
ఈ భోజనాలను జూబ్లీ హిల్స్ లోని ప్రఖ్యాత స్పైసి వెన్యూ రెస్టారెంట్ తయారు చేసింది.పలు రకాల నాన్ వెజ్ వంటకాలు సిద్దం చేసారు.అలా మొత్తంగా తన తండ్రి పెద్దకర్మ కు మహేష్ బాబు దాదాపుగా రెండు కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
అయితే కృష్ణ పెద్దకర్మ కార్యక్రమాలు ఇంట్లో నిర్వహించిన తర్వాత మహేష్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి జేఆర్సి ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు.