అను అగర్వాల్. దొంగ దొంగది సినిమాలో కొంచం నీరు కొంచం నిప్పు అంటూ అభినయించి తెలుగు మరియు తమిళ జనాలకు బాగానే పరిచయం అయ్యింది.
కానీ ఈ సినిమా కన్నా ముందే ఆశికి అనే సినిమాతో హిందీ పరిశ్రమను ఒక ఊపు ఊపింది.అను అగర్వాల్ చిన్నతనం నుంచి ఢిల్లీ లో పుట్టి పెరిగింది.
చెన్నై లో సైతం కొన్నాళ్ల పాటు తండ్రి ఉద్యోగం వల్ల ఉండాల్సి వచ్చింది.ఇక రేడియో జాకీ గా కొన్నాళ్ల పాటు పని చేసింది.
ఆ తర్వాత మాడలింగ్ లో కూడా కొన్నాళ్ల పాటు ఉంది.సినిమాలంటే పెద్దగా ఇష్టం లేకపోయినా మహేష్ భట్ బలవంతం చేయడం తో ఆశికి లో నటించింది.
ఈ సినిమా కోసం 30 లక్షలు ఖర్చు చేస్తే ఐదు కోట్లు కలెక్ట్ చేసింది ఆ రోజుల్లోనే.అంతా క్రేజ్ ఉన్నప్పటికి ఆమె ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకునేది కాదు.
నచ్చితే నటించేది లేకపోతే లేదు.ఆమె చాల సెలెక్టీవ్ గా సినిమాలు చేసేది.
పైగా ఆమెకు నచ్చితే అందాల ఆరబోతకు కూడా అడ్డు చెప్పేది కాదు.క్లోడ్ డోర్ అనే షార్ట్ ఫిలిం కోసం 1994 లో నగ్నంగా నటించింది.
ఓ వైపు బోల్డ్ కంటెంట్ చేస్తూనే మరో వైపు హిమాలయాల్లో అనే ఆశ్రమాల్లో తిరిగేది.సినిమాల్లో నటిస్తూనే బీహార్ లో ఒక స్కూల్ లో కర్మయోగిగా కూడా పని చేసింది.
అయితే అనుకోకుండా ఒక రోడ్ ప్రమాదం లో తీవ్రంగా గాయపడింది.
బాడీ లోని అన్ని పార్ట్స్ లో ఉండే ఎముకలు విరిగిపోయాయి.
ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఆమె చనిపోయిందని అనుకోని వదిలేసి వెళ్లిపోయారు అంతా.కానీ ఆమె బ్రతికింది.నెల పాటు కోమా లో ఉంది.ప్రమాదం లో కార్ గ్లాస్ మొహం లో కుచ్చుకొని మొహం మొత్తం పచ్చడి అయిపోయింది.అలాంటి పరిస్థితి లో ఆమెను ఆమె చూసుకొని చనిపోయిన బాగుండు అనుకుంది.కానీ యోగ, మెడిటేషన్ సాయంతో మళ్లి మాములు మనిషి అయ్యింది.
ఆమె బయోపిక్ ని తీయాలని చర్చలు కూడా జరుగుతున్నాయి.మొన్నీ మధ్య ఆశికి సినిమా పాటలను ఒక రియాలిటీ షో లో ప్రసారం చేస్తూ అందుకు గెస్ట్ గా అను ని కూడా పిలిచారు.
ఆమెతో మాట్లాడించారు.
ఆమె మాటలకూ అందరు చప్పట్లి కొట్టారు.ఆమె సినిమా కాబట్టి అన్ని పాటలు ఆమెవే కాబట్టి ఆమె ఉంటేనే న్యాయం జరుగుతుంది.అయితే ఆ షో ప్రసారం చేసే సమయంలో ఆమె మాట్లాడిన మాటలను ఆమె ఉన్న సీన్స్ అన్ని లేపేసి టెలికాస్ట్ చేసారు.
జీవితం అంతా చితికిపోయిన అనుని ఇలా పిలిచి ఆ టీవీ షో వాళ్ళు అవమానించడం పట్ల సోషల్ మీడియా సాక్షిగా అను ఖండించింది.ఆమె ఆవేదనకు అభిమానుల సహాయం కూడా దొరుకుతుంది.